ప్రగతి భవన్ లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి. భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జాతీయ జండాను ఎగరవేశారు. తర్వాత జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ వేడుకల్లో సిఎంవో అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. మిఠాయీలు పంచుకుంటూ సంబురాలు జరుపుకున్నారు.