
77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శాసనసభ ప్రాంగణంలో జాతీయ జెండాను ఎగురవెసిన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి. పాల్గొన్న శాసనమండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, లెజిస్లేటివ్ సెక్రటరీ డా. వి నరసింహా చార్యులు, ఇతర అధకారులు .
ఈసందర్భంగా సభాపతి పోచారం
మీడియాతో మాట్లాడుతూ…
యావత్ దేశ పౌరులందరికి హృదయపూర్వక స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
కోట్లాదిమంది జరుపుకుంటున్న పండుగ స్వాతంత్ర్య దినోత్సవం.
మహాత్మాగాంధీ గారి నాయకత్వంలో సాదించిన స్వాతంత్ర్య ఫలాలను నేడు మనం అనుభవిస్తున్నాం.
గాందీ గారి నాయకత్వంలో ఎంతోమంది పోరాడి శాంతియుతంగా స్వాతంత్య్రం సాదించారు.
దేశానికి స్వాతంత్య్రం పోరాడి తెచ్చుకున్నం, బ్రిటిష్ వారు ఇవ్వలేదు.
ఇచ్చిన వారు గొప్పవారు కాదు.
అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సాదన కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో శాంతియుతంగా పోరాడి తెచ్చుకున్నదే.
ఈ ఘనత కేసీఆర్ గారిది.
బాధ్యతమైన పదవులలో ఉన్నవారు అన్ని వర్గాలను సమానంగా చూడాలి.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇదే స్పూర్తితో రాష్ట్ర పరిపాలన చేస్తున్నారు.
స్వాతంత్ర్యం అందరి హక్కు అనే ఉద్యేశంతో పరిపాలన సాగుతోంది.
తెలంగాణ పరిపాలన దేశానికి దిక్చూచి.
ధాన్యం ఉత్పత్తి, తలసరి ఆధాయం, విద్యుత్తు తో సహా అనేక రంగాలలో దేశంలో నెంబర్ వన్ గా ఉన్నది.
ఆసరా పెన్షన్లు, రైతుబంధు, రైతబీమా, కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ వంటి సంక్షేమ పథకాలు దేశంలో మరే రాష్ట్రంలో కూడా లేవు.
గ్రామాల అభివృద్ధితో గ్రామ స్వరాజ్యం చూస్తున్నాం.
శాంతిభద్రతలు, సమర్ధతకు మారుపేరు తెలంగాణ రాష్ట్ర పోలీసు.
అందరి కృషి తోనే ఈ అభివృద్ధి సాద్యమైంది
ఈ ఫలాలు దేశంలోని అందరికీ అందాలి.
ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాష్ట్ర సంపదను పెంచి ప్రజలకు పంచుతున్నారు
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి 70లక్షల టన్నుల నుండి 3 కోట్లకు పెరిగిందని మెచ్చుకొన్నారు.
ఒకరినొకరు విమర్శలు చేసుకుని సమయం వృదా చేయరాదు.
కొంతమంది రాజకీయ నాయకులు అమలు కాని హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు
అందరం కలిసి రాష్ట్ర, దేశాన్ని అభివృద్ధి చేయాలి.
ప్రజా సేవలో మనమందరం పునరంకితం అవ్వాలి.
**తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ
జాతిపిత మహాత్మాగాంధీ చూపిన మార్గంలో నడుస్తూ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం
ఉద్యమ నాయకుడు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం కారణంగా రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందింది
కేసీఆర్ గారి పాలన దక్షతతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచింది .అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం ఉంది
అభివృద్ధి పథంలో వేగంగా పరుగులు పెడుతున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్లాడానికి ప్రజలు సహకారం అందించాలి