
కూకట్పల్లి మలేషియన్ టౌన్షిప్ రైన్ ట్రీ పార్క్ లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి.
స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
77 స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని జాతీయ జెండాను ఎగురవేసిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
అపార్ట్మెంట్ వాసుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అంబులెన్స్‌ను ప్రారంభించిన వెంకయ్య నాయుడు
వెంకయ్య నాయుడు మాట్లాడుతూ..
దేశ ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
స్వాతంత్ర పోరాట యోధులను ప్రజలందరూ గుర్తించుకోవాలి
భాష వరు భావం వేరు
కన్నతల్లిని జన్మభూమిని ఎన్నడు మరువకూడదు
మాతృభాష కన్న తల్లి లాంటిది
విద్య నేర్పిన గురువులను మరవకూడదు
కులాల పేరుతో మతాల పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టే వారిని దగ్గరికి రానివ్వకూడదు
అపార్ట్మెంట్ వాసులతో కలిసి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉంది
ఇక్కడ ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి
ప్రపంచంలోనే భారత్ మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుంది
కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అతిపెద్ద రోడ్డు మార్గాలు, రైలు మార్గాలు ఉన్నాయి.
పేదరికం ను నిర్మూలించడంలోనూ భారత్ ముందుంది
ప్రధాని మోడీ తీసుకొచ్చిన రిఫార్మ్స్ తో భారత్ ముందుకు దూసుకెళ్తుంది
దేశంలో ప్రజలు డిజిటల్ లావాదేవీల విషయంలో ముందున్నారు
దేశంలో మనకు జీవనాధారమైన నదులు ఎంత గొప్పవి
మన దేశాన్ని మన సంప్రదాయాలు మన సంస్కృతిని కించపరిచే విధంగా ఎవరు ప్రవర్తించకూడదు
మార్పు కోసం విప్లవం తీసుకురావాల్సిన అవసరం ఉంది.
ప్రస్తుతం రాజకీయ నాయకులు తమ హుందాను మరిచి బూతులు మాట్లాడుతున్నారు
ఇతరులను కించపరిచేలా మాట్లాడే నాయకులకు తగిన బుద్ధి చెప్పాలి
మనల్ని మనం కించపరచుకునేలాగా మాట్లాడకూడదు
రాజకీయ నాయకులు అందరికి ఆదర్శంగా ఉండాలి
క్యాస్ట్ కమ్యూనిటీ క్యాష్ ను ప్రోత్సహించే నాయకులకు దూరంగా ఉండాలి
రాజకీయాల్లో ధన ప్రవాహం ఉండకూడదు
జాతీయ నేతల ప్రసంగం కోసం విద్యార్థి దశలో తాను నెల్లూరు నుంచి చెన్నైకి స్వచ్ఛందంగా వెళ్లేవాడిని
జనంతో వచ్చేవారు వారి ఉపన్యాసాలు వినేందుకు గంటలు తరబడి వెయిట్ చేసేవారు
ప్రస్తుతం రాజకీయ సభలు సమావేశాలకు రావాలంటే ప్రజలు రావాలంటే వారికి బస్సు బిర్యాని బాటిల్ ఇవ్వాలి అని కొందరు నా దృష్టికి తీసుకువచ్చారు
తప్పు చేసే వారిని… అవినీతిపరులను దూరంగా పెట్టాలి
అవినీతికి ఆస్కారం లేని భారత నిర్మించాలి
దీనిలో మనమంతా భాగస్వామ్యం కావాలి
దేశభక్తి అంటే ప్రకృతివనరులను ,నదులను ప్రేమించాలి
మన పిల్లలకు మంచి నేర్పించాలి