
అల్లూ అర్జున్‌కు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు వచ్చిందో లేదో అప్పుడే ఆయన పుష్ప–2 మూవీ గురించి డిస్కషన్ మొదలైంది. ఈ సీక్వెల్ రిలీజ్ డేట్ గురించి టాక్ వినిపిస్తోంది. 2024 మార్చి 24న మూవీ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ అయ్యిందని సినీ ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. దేశవ్యాప్తంగా సెన్సెషనల్ హిట్ అయిన పుష్పకు సీక్వెల్‌పై అందరిలో ఆసక్తి నెలకొంది. అంతేకాక అల్లూ అర్జున్‌కు రికార్డు స్థాయి అవార్డు తెచ్చిపెట్టిన మూవీ సీక్వెల్‌పై ఆయన అభిమానులు ఎంతో ఆశ పెట్టుకున్నారు. ఈ సీక్వెల్ అసలు మూవీకన్నా హిట్ అవుతుందని నమ్మకంతో ఉన్నారు.