
పొత్తుల విషయంలో కెసిఆర్ చరిత్ర క్షమించరాని తప్పు చేసారని, రాజకీయ విలువలకు భిన్నమైన నమ్మకద్రోహం చేసారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. వాళ్ల తప్పు చేస్తే తామేమి కుమిలిబోమని, మరింత సవాలుగా తీసుకొని, కమ్యూనిస్టుల సత్తా ఏమిటో చూపిస్తామన్నారు. ఒక విధంగా కెసిఆర్ మంచే చేసారని, తామేమిటో గుర్తించేలా చేసారని, కమ్యూనిస్టు పార్టీని మరింత కసితో పటిష్టం చేసుకునేందుకు, ఎన్నికల్లో గెలిచేందుకు పని చేస్తామని అన్నారు. హైదరాబాద్ మగ్దూంభవన్ రెండు రోజుల పాటు జరిగిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ, కార్యవర్గ సమావేశ వివరాలను గురువారం సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేన శంకర్, ఇ.టి.నర్సింహాలతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూనంనేని వివరించారు. ప్రజల వద్దకు వెళ్ళి జరిగిన పరిణామాలను వివరిస్తామని, ప్రజలే సరైన తీర్పు ఇచ్చేలా చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు మిత్ర పక్షంగా ప్రజాసమస్యలపై పోరాటాలు చేస్తూనే స్నేహపూర్వకంగా సలహాలిచ్చామని, ఇకపై మిలిటెంట్ పోరాటలు చేస్తామన్నారు. ఇతర పార్టీల లాగా తాము వ్యక్తిగత తిట్లకు దిగబోమని, విధానపరంగానే విమర్శలు చేస్తామన్నారు.
*మిత్రధర్మం మరిచింది ఎవరు?*
కమ్యూనిస్టులు మిత్ర ధర్మం మరిచినట్లు బి ఆర్ ఎస్ పత్రికలో రాసారని , అది దొందే దొంగ అన్నట్లుగా ఉన్నదని కూనంనేని సాంబశివరావు అన్నారు. 2004, 2009లో టిఆర్ సిపిఐ ఒకే కూటమిలో ఉన్నాయని, అయినప్పటికీ 2004లో వెన్నుపోటు పొడుస్తూ సిపిఐకి కేటాయించిన నల్లగొండ ఎంపి స్థానంలో సురవరం సుధాకర్ రెడ్డి, ఇందుర్తిలో చాడ వెంకట్ రెడ్డిలపై టి ఆర్ ఎస్ అభ్యర్థులను పోటీ పెట్టిందని గుర్తు చేశారు. అలాగే 2009లో కూడా హుస్నాబాద్ చాడ వెంకట్ టి ఆర్ ఎస్ పోటీ చేసిందని గుర్తు చేశారు. ఎవరు మిత్రద్రోహం చేసారో చెప్పాలని అన్నారు. కమ్యూనిస్టులు అటు ఇటు పొత్తులు మారుతుంటారని అన్నారని, 2004లో కాంగ్రెస్ 2009లో టిడిపితో టిఆర్ s పొత్తు పెట్టుకోలేదా? అని ప్రశ్నించారు. పైగా తెలంగాణ వాదం కోసం సిపిఐ నాడు పరకాల ఉప ఎన్నికల్లో టి ఆర్ ఎస్ మద్దతిచ్చిందని, అప్పుడు కేవలం 1500 ఓట్లలోపే గెలిచిందన్నారు. అలాగే స్టేషన్ ఘన్pur ఉప ఎన్నికలో కూడా టి ఆర్ ఎస్ కు సిపిఐ మద్దతునిచ్చిందని, అక్కడ స్వల్ప ఓట్లతో గెలిచారని గుర్తు చేశారు. టి ఆర్ ఎస్ కు మొట్టమొదటి రాజ్యసభ స్థానం ఆ పార్టీ సెక్రెటరీ జనరల్ కేశవరావు తనతో సహా సిపిఐకి చెందిన నలుగురు ఎంఎల్ఎల మద్దతుతో గెలిచారని కూనంనేని వివరించారు. ఇవన్నీ సిపిఐ ఓట్లతోనే TRS గెలిచిందన్నారు. తెలంగాణ వచ్చిన తరువాత కూడా హుజూర్ ఉప ఎన్నికలో సిపిఐ మద్దతిచ్చినప్పటికీ R t c సమ్మెతో ఉప సంహరించుకున్నామని, తరువాత దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కూడా మద్దతిచ్చామన్నారు. ఖమ్మంలో తాతా మధుకు MLC అయ్యేందుకు కూడా సిపిఐ మద్దతినిచ్చిందన్నారు. మొన్న మునుగోడు ఎన్నికలలో కూడా సిద్ధాంత ప్రాతిపదికన బిజెపిని ఓడించేందుకే , చివరి వరకు మీతోనే ఉంటామని చెప్పినందుకే బి ఆర్ ఎ స్ కు మద్దతిచ్చామని తెలిపారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు నిమిష నిమిషానికి వైఖరి మార్చుకున్నది కెసిఆరే తప్ప తాము కాదని, వారి అవసరానికి మారారని విమర్శించారు. కనీసం పశ్చాత్తాపం ఉంటుందని భావించామని, అది కూడా లేదని రుజువైందని, రాజకీయ విలువలు ఏ మాత్రం లేవని , రాజకీయ అవసరాల కోసం సాయం చేసిన వారిమీదనే రాజసౌధాలు నిర్మించుకుంటారని అన్నారు.
కలవరపడబోముః తామేమి కలవరపడబోమని, బెంబేలెత్తబోమని, తెలంగాణలో అనేక జిల్లాలలో సిపిఐ , సిపిఐ(ఎం) ప్రభావంతం చేయగలిగిన స్థాయిలో ఉన్నాయని కూనంనేని తెలిపారు. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, రంగారెడ్డి, మెదక్, హైదరాబాద్ జిల్లాలో తమ ప్రభావం ఉంటుందని, కేవలం సిపిఐకి పది వేల నుండి 30 వేల ఓట్లు వచ్చే స్థానాలను లెక్క తీస్తే 35 – 40 స్థానాలు ఉన్నాయని వివరించారు. ఆనాడు తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఆంధ్రప్రాంతంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి తెలంగాణ కోసం పరకాల, స్టేషన్ ఘన్ టిఆర్ సిపిఐ మద్దతునిచ్చిందని, ఆ మద్దతుతోనే వారు గెలిచారని చాడ వెంకట్ రెడ్డి అన్నారు. జాతీయ విధానం ఆధారంగా బిజెపిని ఓడించేందుకు సిపిఐ మునుగోడులో బిఆర్s కోరగా మద్దతు ఇచ్చిందని, ఇప్పుడు తాము మిత్రధర్మం పాటించడం లేదనడమంటే, ఇంత కంటే ఘోరం ఏముంటుందని ప్రశ్నించారు.
*సెప్టెంబర్ 11 – 17 వరకు తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు*
సెప్టెంబర్ 11 నుండి 17వ తేదీ వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు నిర్వహించాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించినట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశిరావు తెలిపారు. ఈ సందర్భంగా సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సాయుధ పోరాట కేంద్రాలకు బస్సుయాత్ర నిర్వహిస్తామని, అలాగే నాటి పోరాటాన్ని స్ఫురణకు తెచ్చే కళా రూపాల ప్రదర్శనలు, సభలు నిర్వహిస్తామన్నారు. తెలంగాణ విలీన దినోత్సవాన్ని టిఆర్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని , ఆనాటి చరిత్రను సమగ్రంగా అందించేందుకు ఒక కమిటీని నియమించాలని డిమాండ్ చేశారు. నాటి పోరాటాన్ని ముస్లింలు, హిందువులకు మధ్య జరిగినట్లు బిజెపి వక్రీకరిస్తోందని మండిపడ్డారు. నాటి సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన వీరుడు మగ్దూం మొహియొద్దీన్ , తొలి అమరుడు బందగీ అని, రజాకార్ల చేతుల్లో హత్యకు గురైన జర్నలిస్టు షోయబుల్లా ఖాన్, పోరాటంలో పాల్గొన్న రజబ్ అలీ వీరంతా ముస్లింలేనని, వారు నిజాం రాచరికానికి వ్యతిరేకంగా పోరాడారని గుర్తు చేశారు. చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ‘కమ్యూనిస్టుల సాయుధ పోరాటమే లేకుంటే తెలంగాణ మరో పాకిస్తాన్ , బంగ్లాదేశ్ అయ్యేదని ప్రత్యేక ఉద్యమ సమయంలో కెసిఆర్ చెప్పిన ఇప్పుడు ఎందుకు మరిచిపోయారని ప్రశ్నించారు. తెలంగాణ వచ్చాక మహారాష్ట్ర , కర్నాటక తరహాలో అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో విలీనోత్సవాలు చేస్తామని చెప్పారని గుర్తు చేశారు. కెసిఆర్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, నాటి పోరాట స్మారకాన్ని, స్మృతి వనాలను నిర్మించాలని, భైరాన్ పల్లి, గుండ్రాంపల్లి, మల్లారెడ్డిగూడెం, మాందాపురం వంటి కేంద్రాలలో అమరుల స్మృతివనాలను నిర్మించాలని డిమాండ్ చేశారు.