
స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల ముగింపు కార్యక్రమం సందర్భంగా రంగారెడ్డి జిల్లా మంచిరేవుల ఫారెస్ట్ రేక్ పార్కులో సీఎం కేసీఆర్ శనివారం కోటి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
తెలంగాణకు హరిత హారం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 26న ఒక రోజు, ఒక కోటి మొక్కలు రాష్ట వ్యాప్తంగా నాటే కార్యక్రమం జరగనున్నది.
ఫారెస్ట్ రేక్ పార్క్ కు సంబంధించిన అంశాలు:
ఫారెస్ట్రెక్ పార్క్ మొయినాబాద్ (M), రంగారెడ్డి జిల్లా:-
• మొత్తం విస్తీర్ణం 256 ఎకరాలు
• ఇంతకుముందు, ఈ ప్రాంతం డంపింగ్ గ్రౌండ్ గా తలపించేది. భవన నిర్మాణ వ్యర్థాలతో నిండి ఉండేది.
• ఈ ప్రాంతం వ్యర్థ పదార్థాలతో నిండి ఉండటంవలన వేదజల్లే దుర్వాసన ప్రాంత వాసులకు ఒక జటిల సమస్యగా పరిణమించింది.
• ఇప్పుడు ఈ ప్రాంతం అభివృద్ధి చేసి ఫారెస్ట్రెక్గా మార్చబడింది. పచ్చదనం కోసం పార్క్ నిండా మొక్కలు నాటడం జరిగింది. ట్రెక్కర్స్ కోసం సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది.
• అటవీ సంరక్షణ, పార్కు పునరుజ్జీవన పనులు ఈ విధంగా చేపట్టడం జరిగింది.
o వివిధ రకాలకు చెందిన 50,000 మొక్కలు నాటారు, నిర్మాణ శిధిలాలను తొలగించిన తర్వాత, ఆ ఖాళీ ప్రదేశాలలో ‘పొద’ జాతికి చెందిన 25,000 మొక్కలు నాటడం జరిగింది.
o కలుపు మొక్కలు తొలగించి, వివిధ రకాల మొక్కలు నాటి వాటి సంరక్షణ పనులు చేపట్టడం జరిగింది.
o రాక్‌ఫిల్ డ్యామ్‌లు, 3 చోట్ల నీటి కుంటలు నిర్మించడం జరిగింది. ఈ ప్రాంతంలో భూసారం, నీటి సంరక్షణ చర్యలతో అటవీ పునరుద్ధరణకు చర్యలు తీసుకోవడం జరిగింది.
o మొత్తం 5.6 కి.మీ మేర విస్తరించి ఉన్న పార్కుకు 4.5 కి.మీల ప్రహరి గోడను నిర్మించారు.
o
• సందర్శకులకు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది.
o తాగునీటి ప్లాంట్
o 4 ట్రెక్కింగ్ మార్గాలు (2 కి.మీ)
o నడక మార్గాలు (4 కి.మీ)
o టాయిలెట్ బ్లాక్
o గెజిబో(2)
o వాచ్ టవర్
o గ్రామ దేవత గుడి
o ఓపెన్ వ్యాయామశాల
o అంఫీ థియేటర్
o జలపాతం
o బ్యాలెన్సింగ్ రాళ్ళు
o పిల్ల ఏనుగు
o డేగ ముఖం
o రచ్చ బండలు
o సీటింగ్ బెంచీలు
o 3 నీటి వనరులు
ఇతర విశేషాలు…
• మొత్తం పెట్టుబడి రూ. 7.38 కోట్లు
• దీనివలన ప్రయోజనాలు:
• 11 మందికి ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉపాధి
• నెలకు దాదాపు రూ.3 లక్షల ఆదాయం సమకూరుతోంది
• పార్క్ లో సందర్శకుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ట్రెక్కింగ్ సౌకర్యం వలన ప్రతి ఆదివారం 2000 మంది సందర్శకులు సందర్శిస్తున్నారు.
• మరింత ఆకర్షణ కోసం చిన్న చిన్న కొండలు నిర్మించడం జరిగింది.