
కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసేందుకు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు
119 నియోజకవర్గాలలో భారీగా ధరఖాస్తులు
వివిధ జిల్లాల నుండి కీలక నేతలు, గతంలో పోటీ చేసిన వాళ్లు, ఆశావాహులు, పలువురు పారిశ్రామికవేత్తలు, సోషల్ వర్కర్లు, కుల సంఘాల నేతలు గాంధీభవన్ లో దరఖాస్తు చేసుకున్నారు
ప్రతి నియోజకవర్గానికి సగటున 8-9 మంది వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు
ఒకటి కంటే ఎక్కువ నియోజకవర్గాలకు దరఖాస్తు చేసుకున్న పలువురు నాయకులు
ప్రతి రోజు దరఖాస్తులకు గాను గాంధీ భవన్ కు పోటెత్తిన ఆశావాహులు
కాంగ్రెస్ పార్టీలో నూతనోత్సాహం
ఈ రోజు దరఖాస్తు చేసుకున్న వారిలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మావతి రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, సీతక్క, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ, సిడబ్యుసి సభ్యులు దామోదర రాజా నర్సింహ, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, సర్వే సత్యనారాయణ, బలమూరి వెంకట్ తదితరులు దరఖాస్తు చేసుకున్నారు..
ఈ రోజు తో దరఖాస్తు గడువు ముగుస్తుంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అందరూ వారి వారి నియోజక వర్గాలలో దరఖాస్తు చేసుకున్నారు. జానారెడ్డి ఎక్కడ దరఖాస్తు చేయలేదు .