
వారణాసిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రెస్ మీట్…
ఈ నెల 26న ( రేపు ) వారణాసిలో జరగనున్న జీ 20 సాంస్కృతిక మంత్రుల సమావేశానికి సంబంధించిన వివరాలను వెల్లడిoచిన కిషన్ రెడ్డి..
భారతదేశ జీ20 నేతృత్వంలో కల్చరల్ వర్కింగ్ గ్రూప్ సమావేశాలు ఇవాళ పూర్తయ్యాయి.
రేపు (శనివారం) సభ్యదేశాలు, 8 ఆహ్వానిత దేశాల సాంస్కృతిక శాఖ మంత్రులు, 6 అంతర్జాతీయ సంస్థల సభ్యులతో జీ20 సాంస్కృతిక శాఖ జీ20 సమావేశాలు పూర్తవుతాయి.
వారణాసి సాంస్కృతిక మంత్రుల సమావేశాలు.. ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్కృతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారంతోపాటు వివిధ అంశాలపై చర్చించేందుకు, ప్రపంచవ్యాప్తంగా సానుకూలమైన ప్రభావం తీసుకొచ్చేందుకు కావల్సిన పరిష్కారాలపై చర్చించేందుకు ఒక చక్కటి వేదికగా నిలవనుంది.
ఫిబ్రవరిలో ఖజురహోలో భారత్ లో మొదటి కల్చరల్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్ జరిగింది.
రెండో కల్చరల్ వర్కింగ్ గ్రూప్ సమావేశం మే నెలలో భువనేశ్వర్ లో…. మూడోది జూలై నెలలో కర్ణాటకలోని హంపిలో జరిగింది.
ఇది నాలుగో, చివరి వర్కింగ్ గ్రూప్ సమావేశం. అనంతరం వారణాసిలోకల్చరల్ డిక్లరేషన్ ఉంటుంది. రేపు ఉదయం వరకు ఈ డిక్లరేషన్ తుదిరూపు సిద్ధమవుతుంది.
ఆ తర్వాత రేపటి మంత్రుల సమావేశంలో ఈ డిక్లరేషన్ ను అడాప్ట్ (ఆమోదిస్తాం) చేసుకుంటాం.
దీనికి సంబంధించి భారత సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో వివిధ వెబినార్లను నిర్వహించాం.
ఈ వెబినార్లలో జీ20 దేశాలతోపాటు వివిధ అంతర్జాతీయ సంస్థలు, భాగస్వామ్య పక్షాలనుంచి 159 మంది పాల్గొన్నారు.
ఈ వెబినార్ల ద్వారా సేకరించిన సమచారంతో వారణాసి డిక్లరేషన్ సిద్ధమవుతుంది.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రేపు సాయంత్రం ఏర్పాటుచేసే కార్యక్రమంలో పాల్గొంటారు.
సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మంత్రుల జీ20 సమావేశం.. చారిత్రకమైన, ఆధ్యాత్మిక నగరమైన వారణాసిలో జరగడం శుభపరిణామం, గర్వకారణం.
ఈ కార్యక్రమం అద్భుతంగా జరగనుందని ఆకాంక్షిస్తున్నాను.