
జవహార్ నగర్ లో అఖిల (17) అనే యువతి పాము కాటుతో మృతి..
విరుగుడు ఇంజక్షన అందక యువతి మృతి
బంగారు తెలంగాణలో పాము కాటుకు ఇంజక్షన్ దొరకని దుస్థితి..?
బాలాజీ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి వెలితే కనీసం యాంటీ వెనమ్ ఇంజక్షన్ ఇవ్వని దుర్భర స్థితి..
మందులు లేవు వేరే ఆసుపత్రికి తీసుకువెళ్లమని సలహా..?
డెంటల్ కాలేజీ, భాగ్య నగర్ కాలనీ సమీపంలోని క్రిష్ణపురి కాలనీలో ఘటన..
సమయానికి విరుగుడు ఇంజక్షన అందక పోవడంతోనే యువతి మృతి చెందిందని బాధిత కుటుంబికుల ఆవేదన..
ఒక నిండు ప్రాణం పోతే కనీసం స్పందించని ఫోటోలకు మాత్రమే ఫోజులిచ్చే పాలకులు, అధికారులు.
ఎక్కడో మారుమూల గ్రామంలో కాదు హైదరాబాద్ నడిబొడ్డున, మంత్రి మల్లారెడ్డి నా గుండె కాయ అని చెప్పుకుతిరిగే జవహార్ నగర్ కార్పోరేషన్ లో పాము కాటుకు గురైన ఓ యువతికి కేవలం ఓ యాంటీ వెనమ్ ఇంజక్షన్ అందక ప్రాణాలు కోల్పోయిన దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది.