
గ్రేట్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ శిష్యుడు డాక్టర్ ఏ.ఆర్.శ్రీధర్ దర్శకత్వంలో వెలువడుతున్న స్లమ్ డాగ్ హజ్బెడ్ స్మూత్ కామెడీతో హాయిగా ఉంటుందని నిర్మాణ సంస్థ చెప్పుకుంటోంది. సంజయ్ రావు, ప్రణవి మానుకొండ ఈ మూవీలో జంటగా నటించారు. జూలై 29న సినిమా రిలీజ్ అవుతోంది. చిత్ర నిర్మాతలు అప్పిరెడ్డి, వెంకట్ అనపరెడ్డిలు మూవీ గురించి మాట్లాడుతూ స్లమ్ డాగ్ హజ్బెండ్ పూర్తి వినోదాత్మక చిత్రమని చెప్పారు. మూఢ నమ్మకాల మీద విమర్శనాత్మకంగా ఉండి చక్కటి సందేశం అందిస్తుందన్నారు. మంచి సినిమాలు తీయాలనే సంకల్పంతో ఈ సినిమాను నిర్మించామనీ, తప్పక ప్రేక్షకుల ఆదరణ పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.