
నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన ‘భైరవ ద్వీపం’ రీ రిలీజ్ చేయనున్నారు. ఆగస్టు 5న ఈ సినిమా రీ రిలీజ్ అవుతోంది. ముఫ్పై ఏళ్ల క్రితం ఈ సినిమా తయారైంది. సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వం వహించిన ఈ మూవీ అప్పట్లో రికార్డు స్థాయిలో బాక్సాఫీస్ కలెక్షన్లను సాధించింది. తొమ్మిది నంది అవార్డులను గెలుచుకుంది. 4కే క్వాలిటీతో సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో రీ రిలీజ్లు కూడా మంచి కలెక్షన్లు సాధిస్తున్నాయి. ఈ మధ్య బాలకృష్ణ నటించిన నరసింహనాయుడు మూవీని రీ రిలీజ్ చేస్తే మరోసారి హిట్ సాధించింది. దాంతో భైరవ ద్వీపం రీరిలీజ్‌కు పూనుకున్నట్లు క్లాప్స్ ఇన్ఫోటైన్మెంట్ సంస్థకు చెందిన చంద్రశేఖర్ కుమారస్వామి తెలిపారు.