
తీన్మార్ మల్లన్న అలియాస్ చింతకింది నవీన్ మేడ్చల్ నియోజక వర్గం నుంచి పోటీ చేయాలని ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఇండిపెండెంట్ గా ఆయన రంగంలోకి దిగాలనుకుంటున్నారు. అయితే మల్లన్న తనకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు.
గుజరాత్ లో జిగ్నేష్ మేవానికి మద్దతు ఇచ్చిన తరహాలో తనకు ఇక్కడ మద్దతు ఇవ్వాలన్నారు. ఇందుకోసం మల్లన్న కాంగ్రెస్ అగ్ర నేతలతో మంతనాలు సాగిస్తున్నట్లు సమాచారం.