
ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ కి నామినేషన్ కోసం 1000 రూపాయలు చొప్పున 1 లక్ష రూపాయలు విరాళం ఇచ్చిన ముఖరా (కె) గ్రామానికి చెందిన 100 మంది పింఛన్ దారులు.
ముఖరా (కె) గ్రామానికి చెందిన పింఛన్ దారులు 1000 రూపాయలు చొప్పున మొత్తం 100 మంది ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ నామినేషన్ కోసం విరాలంగా ఇచ్చారు. తమకు కేసీఆర్ పింఛనే ఆసరా అని, తమకు పెద్ద కొడుకులా నెల నెల పింఛన్ ఇచ్చి తమ బ్రతుకుకు భరోసాగా నిలుస్తుండని పింఛన్ దారులు అన్నారు. అందుకే తమవంతు కృషిగా కేసీఆర్ సారుకు, కేటీఆర్ సారుకు నామినేషన్ కోసం 1000 రూపాయలు చొప్పున విరాళం ఇస్తున్నామ్మన్నారు. జీవితాంతం కేసీఆర్ రుణపడి ఉంటామని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ కి తమ విరాళం 1 లక్ష రూపాయలు అందించాలని సర్పంచ్ గాడ్గే మీనాక్షికి ఇచ్చారు.