
వీఎన్ఆర్ నాయుడు, మింట్ చీఫ్ జనరల్ మేనేజర్
హైదరాబాద్ మింట్ లో ఎన్టీఆర్ స్మారక నాణెం తయారు చేశాం
ధర రూ. 3,500 నుంచి రూ.4,850 వరకు ధర ఉంటుంది
దీని తయారీకి కూడా మాకు అంతే ఖర్చు అవుతుంది
తొలి విడతలో 12,000 నాణేలు తయారు చేశాం
డిమాండ్ కి తగినంత సప్లై లేదు. అందరికీ అందేలా నాణేలు తయారు చేస్తాం. డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది.
ఇది స్మారక నాణెం. ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా రూ.100 డినామినేషన్ తో కాయిన్ చేశాం
ఇది మార్కెట్ లో చలామణి కోసం కాదు. కేవలం స్మారక నాణెం.
హైదరాబాద్ మింట్ లో తొలిసారి ఒక వ్యక్తి పేరు మీద నాణెం ముద్రించాము. గతంలో టైగర్ కాయిన్ చేశాం
ముంబై మింట్ లో గతంలో ఇలాంటి స్మారక నాణేలు తయారు చేశారు
ఆన్లైన్ తో పాటు హైదరాబాద్ నగరంలో మూడు చోట్ల సేల్ కౌంటర్లు కూడా ఏర్పాటు చేశాం