
బీఆర్ఎస్ ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ అల్లుడు శరత్ చంద్ర పవార్ ట్రాన్స్ఫర్ అయ్యారు. మహబూబాబాద్ ఎస్పీగా ఉన్న శరత్ చంద్రను తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీకి బదిలీ చేశారు. ఖానాపూర్ టికెట్ రాకపోవడంతో రేఖా నాయక్ కాంగ్రెస్‌లో చేరాలనుకుంటున్నట్లు ఆమె సన్నిహితుల వద్ద అంటున్నారు. కాంగ్రెస్ నేతలతో ఆమె ఖానాపూర్ సీటు కోసం మంతనాలు సాగిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. అంతేకాక తనకు టికెట్ ఇవ్వని బీఆర్ఎస్ సంగతి చూస్తానని కూడా ఆమె కార్యకర్తల దగ్గర మాట్లాడారు. దీంతో అత్త మీద కోపంతో అల్లుడి మీద వేటు వేసినట్లు పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. శరత్ చంద్రకు ఇపుడు అంత ప్రాధాన్యత లేని చోట పోస్టింగ్ ఇచ్చినట్లు మాట్లాడుతున్నారు. శరత్ చంద్ర, రేఖా నాయక్ కూతురి భర్త. శరత్ చంద్ర స్థానంలో గుండేటి చంద్రమోహన్‌ను నియమిస్తూ సీఎస్ శాంతి కుమారి కొద్దిసేపటి క్రితమే ఉత్తర్వులు జారీ చేశారు.
