
తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తే ఎమ్మెల్సీ కవిత అక్కడి నుంచి పోటీ చేస్తానంటోందని బీజేపీ నేత, ఎంపీ అర్వింగ్ అన్నారు. సోమవారం ఆయన బీజేపీ స్టేట్ ఆఫీసులో ప్రెస్మీట్ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో తాను కవిత వెంట పడడం లేదన్నారు. కానీ ఆమె మాత్రం తన వెంటపడుతోందని చెప్పారు. ఈ సారి కవిత నిజామాబాద్ నుంచి పోటీ చేస్తే మూడో స్థానానికి వెళ్లడం ఖాయమన్నారు.
కాగా సీఎం కేసీఆర్ మరోసారి కొత్త రకం దోపిడీకి తెర లేపారని అరవింద్ ఆరోపించారు. రాష్ట్రంలో నిల్వ ఉన్న కోటి టన్నుల వరి ధాన్యంను వేలం వేసి, దాని ద్వారా రూ. 4 నుంచి 5 వేల కోట్లను దోచుకునేందుకు కుట్ర పన్నారన్నారు. మరో 3 నుంచి 4 నెలల్లో జరుగనున్న ఎన్నికల్లో ఈ డబ్బును ఖర్చు చేసేందుకు కేసీఆర్ ఈ కుట్ర చేస్తున్నారన్నారు. ఇలా దోపిడీ ద్వారా వచ్చిన డబ్బులో ఒక్కో బీ ఆర్ ఎస్ అభ్యర్థికి 40 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు కేసీఆర్ రెడీ అవుతున్నారని అరవింద్ అన్నారు. ధాన్యం వేలంలో కనీస మద్దతు ధరకు ధాన్యంను మేము కొనుగోలు చేస్తామని తెలంగాణ ప్రాంత రైస్ మిల్లర్లు కోరినా …వారిని ధాన్యం వేలంలో పాల్గొనకుండా కేసీఆర్ చేస్తున్నారన్నారు. ఈ ధాన్యం వేలం వెనుక మంత్రి కేటీఆర్ మాస్టర్ మైండ్ ఉందని అరోపించారు. ఆంధ్రా ప్రాంత రైస్ మిల్లర్లు ఈ వేలంలో పాల్గొనేలా కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారన్నారు.