
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సెప్టెంబర్ 6వ తేదీన కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. మల్కాజ్గిరి నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన ఇటీవల మంత్రి హరీష్ రావు మీద హాట్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనపై వేటు తప్పదని పార్టీ వర్గాల్లో చర్చ జరిగింది. మంత్రి కేటీఆర్ కూడా ఆయనపై పార్టీ పరంగా క్రమశిక్షణా చర్యలుంటాయని అన్నారు. మైనంపల్లి హనుమంతరావు తిరుపతిలో చేసిన కామెంట్స్‌పై కవిత కూడా తీవ్రంగానే స్పందించారు. తామంతా హరీష్‌కు మద్దతుగా ఉంటామని చెప్పారు. కేసీఆర్ ఈ కామెంట్లపై ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు. అయితే మైనంపల్లిపై చర్యలు చేపట్టాలని కవిత, హరీష్‌లు కేసీఆర్‌ను పట్టుపడుతున్నట్లు సమాచారం. దాంతో మైనంపల్లి కూడా తనపై వేటు తప్పదని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఇటీవల తన అభిమానులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. పార్టీ మారడమే బెటర్ అని నిర్ణయానికి వచ్చిన ఆయన కాంగ్రెస్‌లో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు సన్నిహిత వర్గాల సమాచారం. కాంగ్రెస్‌లో చేరిత తన కొడుకుకి ఎంపీ టికెట్ సాధించవచ్చని ఆయన ఆశపడుతున్నట్లు తెలుస్తోంది.