
స్కూళ్లలో మొబైల్ ఫోన్లను ఏపీ ప్రభుత్వం నిషేధించింది. బోధనకు ఎలాంటి ఆటంకం కలుగుకుండా ఉండేందుకు జగన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు ఇకపై స్కూల్కు ఫోన్ తీసుకురాకూడదని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. అన్ని స్కూళ్లలో ఈ నిబంధన పాటించేలా చర్యలు చేపట్టాలని పాఠశాలలను ఆదేశించింది. విద్యార్థులు ఫోన్ల కారణంగా చదువులపై సరిగ్గా దృష్టి నిలపడం లేదని జగన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. దీన్ని అమలు చేయడంలో కఠినంగా వ్యవహరించాలని సీఎం జగన్ విద్యాశాఖను ఆదేశించినట్లు తెలిసింది.