
కాంగ్రెస్ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ (పీఈసీ) సమావేశం జరగనుంది. గాంధీభవన్లో సాయంత్రం 4 గంటలకు సమావేశం జరుగుతుంది. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్ రావు ఠాక్రే, ముగ్గురు ఇంఛార్జి సెక్రెటరీలతోపాటు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, 26 మంది సభ్యులు పాల్గొంటారు. 119 నియోజక వర్గాలకు గాను వచ్చిన వెయ్యికి పైగా దరఖాస్తులను ఈ మీటింగ్లో పరిశీలిస్తారు. 34 నియోజక వర్గాల్లో 10కి పైగా ఆశావహులు టికెట్ కోసం అప్లై చేసుకున్నారు. కాగా 35 నుంచి 40 నియోజక వర్గాల్లో ఎలాంటి వివాదం లేనందున ఈ సెగ్మెంట్లో అభ్యర్థుల ఖరారు ఈజీ కానుంది. మిగితా స్థానాలకు సుదీర్ఘ కసరత్తు తప్పేలా లేదు. ఈ కమిటీ మీటింగ్ తర్వాత రెంఓడ దశలో స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థుల ఎంపికను పరిశీలించి ఏఐసీసీకి పంపుతుంది. దాంతో ఆశావహులు ఆల్రెడీ లాబియింగ్ మొదలుపెట్టారు. తమకు పరిచయం ఉన్న ఏఐసీసీ పెద్దలతో పైరవీలు చేయించుకుంటున్నారు. టికెట్ తమకే దక్కేలా ప్రయత్నాలు చేసుకుంటున్నారు.