
ఖానాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖా నాయక్ కాంగ్రెస్ ఆశావహుల జాబితాలో ఉన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆమెకు టికెట్ నిరాకరించడంతో కాంగ్రెస్ టికెట్ కోసం ఆమె అప్లై చేసుకున్నారు. కానీ దరఖాస్తు చేసిన మరుసటి రోజే తాను కాంగ్రెస్ టికెట్ కోసం అప్లై చేయలేదనీ, బీఆర్ఎస్ టికెట్టే తనకు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం టికెట్ దక్కించుకున్న జాన్సన్ నాయక్ ఎస్టీ కాదనీ, ఆయన క్రిస్టియన్ అని రేఖా నాయక్ వాదించారు. ఈ ఈక్వేషన్ ప్రకారం టికెట్ తనదేనన్నారు. కానీ ఆమె కాంగ్రెస్ అధిష్టానంతో టచ్‌లో ఉన్నారని తాజా జాబితాతో స్పష్టం అవుతోంది. తనకు ఖానాపూర్, తన భర్త శ్యామ్ నాయక్‌కు ఆసిఫాబాద్ టికెట్ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. ఇద్దరిలో ఒక్కరికే ఇస్తామని కాంగ్రెస్ స్పష్టం చేస్తోంది. అంతేకాక రేఖా నాయక్‌ను ఆసిఫాబాద్ నుంచి గానీ, లేదా పార్లమెంట్ ఎన్నికల్లో అదిలాబాద్ స్థానం నుంచి పోటీ చేయమని అడుగుతున్నట్లు తెలుస్తోంది. పరిణామాలన్నీ ఇంకా చర్చల దశలోనే ఉన్నాయి.
