కాంగ్రెస్‌లో 30 మందికి టికెట్లు దాదాపు ఖరారుగా భావిస్తున్నారు. ఆ నియోజక వర్గాల్లో ఇతరులు అప్లై చేసుకోకపోవడం, కొన్ని చోట్ల ఒకే కుటుంబానికి చెందిన వారు దరఖాస్తు చేసుకోవడంతో వీరి పేర్లు ఖరారయ్యారు. కొన్ని నియోజక వర్గాల్లో దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉన్నా సీనియర్ నేతలు అక్కడ బరిలో ఉండడానికి ఆసక్తి చూపడంతో వేరే వాళ్లకు టికెట్ దక్కే అవకాశం కనిపించడం లేదు. బలమైన అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి.
1.కొడంగల్ – రేవంత్ రెడ్డి
2.మధిర – భట్టి విక్రమార్క
3.జగిత్యాల – జీవన్ రెడ్డి
4.హుజూర్నగర్ – ఉత్తంకుమార్ రెడ్డి
5.కోదాడ – పద్మావతి
6.మంథని – శ్రీధర్ బాబు
7.నల్గొండ – కోమటిరెడ్డి వెంకటరెడ్డి
8.సంగారెడ్డి – జగ్గారెడ్డి
9.ఆందోల్ – దామోదర రాజనర్సింహ
10.ములుగు సీతక్క
11.భద్రాచలం – పొదెం వీరయ్య
12.నాగార్జునసాగర్- కుందూరు జైవీర్ రెడ్డి
13.కామారెడ్డి – షబ్బీర్ అలీ
14.మంచిర్యాల – ప్రేమ్ సాగర్ రావు
15.అలంపూర్ – సంపత్ కుమార్
16.వరంగల్ తూర్పు- కొండా సురేఖ
17.పరిగి – రామ్మోహన్ రెడ్డి
18.వికారాబాద్ – గడ్డం ప్రసాద్
19.ఇబ్రహీం పట్నం – మల్రెడ్డి రంగారెడ్డి
20.ఆలేరు – బీర్ల ఐలయ్య
21.వనపర్తి – చిన్నారెడ్డి
22.మహబూబాబాద్ – బెల్లయ్య నాయక్
23.తుంగతుర్తి– అద్దంకి దయాకర్
24.గోషామహల్ – మెట్టు సాయి కుమార్
25.నారాయణ్‌ఖేడ్ – సురేష్ షేట్కర్
26.ముషీరాబాద్ – అంజన్ కుమార్ యాదవ్
27.మిర్యాలగూడ – రఘువీరా రెడ్డి
26.నాగర్ కర్నూల్ – కూచుకుళ్ల రాజేష్ రెడ్డి
27.మేడ్చల్ – హరివర్ధన్ రెడ్డి
28.ఉప్పల్ – రాగిడి లక్ష్మారెడ్డి
29.జూబ్లీహిల్స్ – అజారుద్దీన్
30.ఖైరతాబాద్ – రోహిణ్ రెడ్డి