
రాఖీ పండగ ముందర విషాదం…
అన్న మృతదేహానికి రాఖీ కట్టిన చెల్లెలు..
పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం
ధూళికట్టకి చెందిన చౌదరి కనకయ్యకు రాఖీ కట్టేందుకు
చెల్లె ఇంటికి వచ్చింది.
అప్పటిదాకా చెల్లెతో సంతోషంగా
గడిపిన కనకయ్య.. ఒక్కసారిగా గుండెపోటుతో
చనిపోయాడు.
దీంతో ఆయన మృతదేహానికే సోదరి
గౌరమ్మ రాఖీ కట్టి తన ప్రేమను చాటింది. ఇద్దరి
మధ్య ఉన్న అనురాగాన్ని చూసినవారంతా కన్నీటిపర్యంతమయ్యారు.