
సమస్యలు , ఇబ్బందులను ఓర్చుకోలేక కదం తొక్కిన స్టూడెంట్స్
ప్రిన్సిపాల్ తొలగించాలని ర్యాలీ , రాస్తారోకో, ధర్నా
కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ కు చొచ్చుకు వెళ్లిన వందలాది మంది స్టూడెంట్స్
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఉద్రిక్త వాతావరణం
జిల్లా కేంద్రంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ లో ప్రిన్సిపాల్ జ్యోతి లక్ష్మి పట్టింపు కరువై ఇబ్బందులు, అదేవిధంగా వాచ్ మెన్ రాత్రి తాగొచ్చి ఇబ్బంది పెడుతున్న విషయాలపై స్టూడెంట్స్ రోడ్డెక్కారు. ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేయాలని నిరసిస్తూ స్టూడెంట్స్ బుధవారం ఆందోళన కు దిగారు.స్కూల్ నుండి ర్యాలీగా అంబేద్కర్ చౌక్ చేరుకుని అంతరాష్ట్ర రహదారిపై రాస్తారోకో, ధర్నా కు
దిగారు.అక్కడి నుండి కలెక్టర్ క్యాంపు ఆఫిస్ కు చేరుకుని గేట్లు తోసేసి క్యాంప్ కార్యాలయం ముందు బైటయించారు.కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది
తర్వాత కలెక్టరేట్ ఎదుట ధర్నా దిగారు. నాలుగు గంటల పాటు ఆందోళన చేస్తున్నారు.
ఈసందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. హస్టల్ లో బోజనం సరిగ్గా లేదని, బాత్రూమ్, టాయిలెట్, డార్మెట్ రూమ్ లలో కనీస సౌకర్యాలు లేవని చెప్పారు. అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థులను హస్పిటల్లకు తరలించకుండా గోలిలు మాత్రమే ఇస్తూ ఆరోగ్యం పై శ్రద్ధ చూపడం లేదని మండిపడ్డారు. టిచర్, ప్రిన్సిపాల్ మధ్య సమన్వయం లేదని, దీంతో తమ ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. సమస్యలు పరిష్కారించాలని గతంలో ఆర్ సి ఓ దృష్టికి తీసుకెళ్లిన స్పందన లేకపోవడంతో గత్యంతరం లేని రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పారు. ప్రిన్సిపాల్ తమని సరిగా చూసుకోవడం లేదని, భోజనం వైద్య, వసతుల విషయంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. మేను ప్రకారం భోజనం పెట్టడం లేదని, వార్డెన్ పెట్టాలని చూసినా వీళ్ళకెందుకు ఇలాంటి తిండి పెట్టి వేస్ట్ అంటూ సరైన ఆహారం పెట్టకుండా అడ్డుకుంటుందని విద్యార్థినిలు ఆరోపించారు.
నైట్ వాచ్ మెన్ డ్యూటీలో మద్యం సేవించి విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. తమ పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రిన్సిపాల్ ను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఉదయం ఏడున్నర గంటల నుండి హాస్టల్ నుండి బయటికి వెళ్లి విద్యార్థులు ఇప్పటివరకు ఎలాంటి అల్పాహారం కూడా తీసుకోకుండా ఆందోళన చేస్తున్నారు.జిల్లా కలెక్టర్ బయటికి రావాలని , ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేయాలని అప్పటి వరకు కలెక్టరేట్ నుండి కదిలేది లేదని భీష్మించి కూర్చున్నారు.ఆందోళన చేస్తున్న స్టూడెంట్స్ లను పోలీసులు సముదాయించి అయిదుగురు స్టూడెంట్స్ ను డీ ఆర్ ఓ కదం సురేష్ దగ్గరకు తీసుకువెళ్లరు. డిమాండ్ లు ,సమస్యల గురించి వినతి పత్రం ఇప్పించారు.వెంటనే స్పెషల్ ఆఫీసర్ ను నియమించి తాగు చర్యలు తీసుకుంటామని డీ ఆర్ ఓ సురేష్ చెప్పారు. అయితే ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేసేదాకా ఆందోళన విరమించేది లేదని స్టూడెంట్స్ తేల్చి చెప్పారు.