
ప్రముఖ మలయాళ నటి అపర్ణా నాయర్ మృతి చెందారు. ఆమె తన ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు శుక్రవారం వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన గురువారం సాయంత్రం 7.03 గంటల సమయంలో జరిగింది.
అపర్ణా నాయర్ కరమన సమీపంలో ఉన్న తన ఇంట్లోని గదిలో ఉరివేసుకున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన ఆమె కుటుంబ సభ్యులు ఆమెను ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. ప్రయివేటు ఆసుపత్రి నుంచే తమకు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై అసహజ మరణం కింద కేసు నమోదు చేసినట్లు ఓ పోలీసు అధికారి మీడియాకు వెల్లడించారు. కుటుంబ కలహాల వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఫటనపై దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు. అపర్ణా నాయర్‌కి భర్త, ఇద్దరు పిల్లలున్నారు.