ఆదిత్య-ఎల్1 ఉపగ్రహం నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీహరికోట సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి పీఎస్ఎల్వీ-సి 57 వాహకనౌక ఆదిత్య-ఎల్1 ను విజయవంతంగా నింగిలోకి మోసుకెళ్లింది.
ఆదిత్య-ఎల్1 ఉపగ్రహం 4 నెలలపాటు ప్రయాణించి భూమి నుంచి సూర్యుడి దిశగా ఉన్న ‘ఎల్1’ (లగ్ రేంజ్) పాయింట్‌ను చేరుకోనుంది.
15 లక్షల కిమీ దూరంలోని ఈ ప్రదేశంలోకి భారత్ ఉపగ్రహ ప్రయోగం చేపట్టడం ఇదే మొదటిసారి.
ఈ ప్రదేశం నుంచి ఎలాంటి అవరోధాల్లేకుండా సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేసే వీలుంది. ఇందులో 7 పరిశోధన పరికరాలున్నాయి.

ఇస్రో ఆదిత్య L1 సక్సెస్
ఆదిత్య-ఎల్1ను పీఎస్ఎల్వీ-సి57 రాకెట్ కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టింది.
రాకెట్ నుంచి ఆదిత్య-ఎల్1 విడిపోయినట్లు ISRO ఛైర్మన్ సోమనాథ్ వెల్లడించారు.
తర్వాత ‘ఎల్1’ (లాగ్ రేంజ్) పాయింట్ వైపు ఆదిత్యను నడిపిస్తారు. ఈ క్రమంలో అది భూ గురుత్వాకర్షణ ప్రభావ ప్రాంతం (ఎస్వోఐ)ను దాటి వెళుతుంది. అనంతరం క్రూజ్ దశ ప్రారంభమవుతుంది. ఇలా నాలుగు నెలల ప్రయాణం తర్వాత ఉపగ్రహం ఎల్1 బిందువును చేరుకుంటుంది.
ఈ ప్రదేశం నుంచి ఎలాంటి అవరోధాల్లేకుండా సూర్యుడిని నిరంతరం అధ్యయనం ఆదిత్య-ఎల్1 చేసే వీలుంది.
దీంతో అమెరికా, జపాన్, యూరప్, చైనా దేశాల తర్వాత భానుడిపై పరీక్షల కోసం విజయవంతంగా రాకెట్ పంపిన దేశంగా భారత్ నిలిచింది.
ప్రయోగ సక్సెస్‌తో ఇస్రో శాస్త్రవేత్తల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
అటు సైంటిస్టులను యావత్ భారతావని కీర్తిస్తోంది.