
గాంధీ భవన్లో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సిడబ్ల్యుసి సభ్యులు రఘువీరారెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యులు కెవిపి రామచంద్ర రావు, ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తదితర కాంగ్రెస్ నాయకులు.
గాంధీభవన్లో మీడియా సమావేశం
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కామెంట్స్
రైతు పక్షపాతి డాక్టర్ వైయస్సార్
ఎవరూ ఊహించని రోజుల్లో ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే ప్రమాణ స్వీకారం రోజున ఉచిత కరెంటు ఫైలు పై సంతకం చేసిన మాట తప్పని మహానాయకుడు డాక్టర్ వైఎస్ఆర్ఉచిత కరెంటు కాంగ్రెస్ పార్టీకి మాత్రమే పేటెంట్. ఉచిత కరెంటు గురించి మాట్లాడే అర్హత ఇతరులకు లేదురైతులకు రుణమాఫీ ఏకకాలంలో చేసిన చరిత్ర వైఎస్ఆర్, కాంగ్రెస్ పార్టీది మాత్రమే.పేద మధ్యతరగతి ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించడానికి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టిన మానవతావాది డాక్టర్ వైయస్సార్ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాల్లో సాంకేతికంగా, సాఫ్ట్వేర్ రంగాల్లో ప్రావీణ్యం పొంది పేద విద్యార్థులు స్థిరపడడానికి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి తీసుకువచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా కల్పించిన అవకాశమేతెలుగు రాష్ట్రాల్లో గుడిసె అనేది లేకుండా చేయాలన్న లక్ష్యంతోఇంటి స్థలాలు పంపిణీ చేసి ఇండ్ల నిర్మాణానికి అద్భుతమైన ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రవేశపెట్టి పేదలకు ఇల్లు కట్టించిన మహానేత వైయస్సార్డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి మోసం చేసి రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లు లేకుండా చేసిన బిఆర్ఎస్ ప్రభుత్వంఎన్ని ప్రతిబంధకాలు ఉన్న వాటిని అధిగమించి మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించిన మహా నేత వైయస్సార్జలయజ్ఞం ప్రాజెక్టు ద్వారా అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మాణం చేసి తెలుగు రాష్ట్రాల్లో సాగు తాగునీరు కరువు లేకుండా చేసిన మహానాయకుడు వైయస్సార్రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభించిన ఇందిర, రాజీవ్ సాగర్, ప్రాణహిత ప్రాజెక్టులను బిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసి ఉంటే తెలంగాణలో 24 లక్షల ఎకరాలకు సాగునీరు అంది ఉండేదిడాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి మహిళలకు అందించిన పావలా వడ్డీ రుణాలను విస్మరించిన బిఆర్ఎస్ ప్రభుత్వందివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి ఆలోచనలు ముందుకు తీసుకెళ్లి ఆయన మార్గంలో నడవడమే మనం వైయస్ఆర్ కు అర్పించే నిజమైన నివాళి.