
అమెరికా పర్యటన ముగించుకొని ఇండియాకు చేరుకున్న బిఎస్పి రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…విదేశాల్లో ఉన్న బహుజనులు తెలంగాణలో బహుజన రాజ్యం కావాలని కోరుకుంటున్నారు. తెలంగాణలో బహుజన వర్గాలపై అణచివేత తీవ్రంగా ఉందని ఆవేదనతో ఉన్నారు.సుమారు 600మంది విద్యార్థులు అమెరికాలో చదువుతూ, అంబేడ్కర్ ఓవర్ సీస్ నిధులు విడుదల అందక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. తెలంగాణలో వట్టే జానయ్య యాదవ్ వంటి బహుజనులపై దాడులు అత్యంత బాధాకరం అన్నారు. రాష్ట్రంలో బిఆర్ఎస్,కేంద్రంలో బిజెపి అణచివేత ఆగాలంటే బహుజన రాజ్యం రావాలన్నారు. బెహన్ జీ కుమారి మాయవతి గారిని ప్రధాని చేస్తామన్నారు.*సెప్టెంబర్ మూడో వారం వరకు బిఎస్పి అభ్యర్థులను ప్రకటిస్తానన్నారు.ఎయిర్ పోర్టులో పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు.