
డీసీఎంఎస్ చైర్మన్ వట్టి జానయ్య యాదవ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్..
- ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ కామెంట్స్ :-
- మొత్తం తెలంగాణ సమాజానికి స్ఫూర్తి సందేహం ఇచ్జిన వట్టే అయిలమ్మ కు పాదాభివందనం.
- గాంధీ నగర్ లో ఆంక్షల నడుమ సమావేశం నిర్వహించాల్సిన దుస్థితి నేడు తెలంగాణ లో నెలకొంది.
- సూర్యాపేటకు వస్తుంటే అడుగడుగునా పోలీసులతో అరెస్టులు చేయిస్తున్నారు
- గాంధీనగర్ కాశ్మీర్ లో ఉందా తెలంగాణ లో ఉందా
- మంత్రి జగదీశ్ రెడ్డి అడుగడుగునా పోలీస్ ఆంక్షలు పెట్టారు
- జానయ్య పై కేసులు నమోదైనప్పటి నుండి ఆయన ఇంటికి కరెంట్ బంద్ చేశారు .
- 25ఆగస్ట్ హైదరాబాద్ లోని బీసీ గర్జనకు వచ్చి జానయ్య పాల్గొంటే జగదీష్ రెడ్డికి భయం మొదలయింది
- జానయ్య కొడుకు పెళ్లికి 50 వేల మంది వస్తే బిసి బిడ్డ ఇంటికి 50 వేల మంది ఎలా వస్తరని మంత్రి జగదీష్ రెడ్డికి భయం పట్టుకుంది
- బిసి బిడ్డలు అగ్రవర్ణ కులాల కింద చెప్పులుగా బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది
- రాజకీయం అంతా రెడ్ల చేతుల్లోనే నడుస్తున్నాయి
- ఎస్సి, ఎస్టీ, బిసిలు బానిస బ్రతులులుగా బ్రతకాలని రెడ్లు శాసిస్తున్నారు
- 26సంవత్సరాలు పోలీస్ శాఖలో పని చేశా ఎప్పుడు కూడా ఇలాంటి నిర్బందపు ఆంక్షలు చూడలేదు
- అధికార పార్టీ నాయకులు అరెస్ట్ చేయమంటే చేస్తున్నారు కేసులు పెట్టమంటే పెడుతున్నారు
- హోమ్ మంత్రి ఎక్కడ ఉన్నాడు
- పోలీసులు సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి తెలంగాణ ఉంది
- తల్లిని పరామర్శించడానికి వస్తుంటే ఆంక్షల మధ్య అరెస్టులు చేసి జైల్లో పెడుతున్నారు
- ఎస్సి, ఎస్టీ బిసిలు అణచివేసేందుకు జగదీశ్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు
- మీ పార్టీలోని డిసిఎంఎస్ నాయకుడు అతని భార్య అజ్ఞాతంలోకి వెళ్ళిపోతే సీఎం కేసీఆర్, డిజిపి, హోం మంత్రి ఎక్కడున్నారు, ఏమి చేస్తున్నారు.
- సర్దార్ పాపయ్య ను వ్యతిరేకంగా పోరాడినందుకు తల మొండెం వేరు చేసి గోల్కొండ కోటకు వేలాడదీశారు, బెల్లి లలిత శరీర భాగాలు వేరు చేశారు.
- ఇప్పుడు వట్టే జానయ్య ను కూడా అదే విదంగా మంత్రి జగదీశ్ రెడ్డి మనుషులు చంపాలని ప్రయత్నాలు చేస్తున్నారు
- 30 వేల ఎకరాల బిసి, ఎస్సి, ఎస్టీ భూములు తీసుకొని రూ.100 కోట్లకు అమ్ముకున్న కేసీఆర్ పై కేసులు పెట్టాలి