
చిన్న సినిమాగా వచ్చి సెన్సేషనల్ హిట్ సాధించిన ‘బలగం’ సినిమాలో సర్పంచ్ క్యారెక్టర్లో కనిపించిన నర్సింగం మృతి చెందారు. ఈ క్రమంలో డైరెక్టర్ వేణు నివాళులర్పిస్తూ ఆయనతో ఉన్న అనుబంధాలను
పంచుకున్నారు.
‘నర్సింగం బాపుకి శ్రద్ధాంజలి. మీ చివరి రోజుల్లో బలగం సినిమా ద్వారా మీలోని నటుడిని చూసుకొని.. మీలోని కళాకారుడు తృప్తి చెందడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఓంశాంతి’ అని ట్వీట్ చేశారు.