
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీనడం
నిన్నటి వరకు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగిన ఉపరితల ఆవర్తనం ఈరోజు ఉదయం అల్పపీడనంగా మారింది…
ఈ అల్పపీడనం కి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టం కి 7.6 కి మి వరకు వ్యాపించి ఎత్తుకి వెళ్లే కొలది నైరుతి దిశ వైపుకి వాలి ఉంది
అల్పపీడనం రాగల 24 గంటలు సుమారు పచ్చిమ దిశగా దక్షిణ ఒడిశా మరియు దక్షిణ చతిస్గడ్ మీదుగా కదిలి అవకాశం ఉంది..
అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో భారీగా వర్షాలు –
రాష్ట్రానికి మూడు రోజులపాటు భారీ వర్షా సూచన
*ఈరోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు *అనేక చోట్ల* మరియు ఎల్లుండి చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది.
రాష్ట్రంలో ఈరోజు రేపు భారీ నుండి అతిభారీ వర్షాలు అక్కడక్కడ కొన్ని జిల్లాలలో వచ్చే అవకాశం ఉంది..
ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు 5 జిల్లాల్లో కురిసే అవకాశం
5 జిల్లాలకు ఆరంజ్ అలెర్ట్స్ ప్రకటించిన వాతావరణ శాఖ
జయశంకర్ భూపాలపల్లి, ములుగు ఖమ్మం నల్గొండ మహబూబాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్స్.. భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం
భారీ వర్షం కొమరం భీమ్ ఆసిఫాబాద్ మంచిర్యాల్ కరీంనగర్ పెద్దపల్లి భద్రాద్రి కొత్తగూడెం సూర్యాపేట వరంగల్ హనుమకొండ జనగాం సిద్దిపేట యాదాద్రి భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్ మహబూబ్నగర్ కరీంనగర్ వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉండడం తో ఎల్లో అలెర్ట్స్ జారీ చేసిన వాతావరణ శాఖ అధికారులు
ఈరోజు, రేపు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులతో ( గాలి వేగం గంటకు 40 నుండి 50 కిమి తో )కూడిన వర్షాలు అక్కడక్కడ కొన్ని జిల్లాలలో వచ్చే అవకాశం ఉంది.
ఈరోజు నగరానికి ఎల్లో అలెర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ..
నగరంలో మోస్తారు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం …