
కేరళలో ఒక డంప్ యార్డ్లో పని చేసే మహిళా కార్మికులకు 10 కోట్ల రూపాయల జాక్ పాట్ తగిలింది. మలయాళీల రాష్ట్రంలో ప్రభుత్వమే అధికారికంగా లాటరీ నిర్వహిస్తుంది. దాంతో 11 మంది కార్మికులు కలిసి 250 రూపాయలతో ఒక టికెట్ కొన్నారు. ఒక్కరి దగ్గర అంత మొత్తం లేకపోవడంతో తలా కొంచెం వేసుకొని టికెట్ కొన్నారు. గతంలో ఒకసారి ఓనం పండగకు ఇలాగే అందరూ కలిసి డబ్బులేసుకొని టికెట్ కొంటే ఏడున్నర వేల రూపాయలు వచ్చాయట. దాంతో మళ్లోసారి తమ కాంబినేషన్ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు మాన్సూన్ బంపర్ టికెట్ కొన్నారు. దీనికి రూ. 10 కోట్ల లాటరీ గెలిచినట్లు కేరళ ప్రభుత్వ లాటరీ డిపార్ట్మెంట్ ప్రకటించింది. దీంతో కష్టాలన్నీ తీరుతాయని కార్మికులు సంతోషిస్తున్నారు. వీళ్లంతా డంప్ యార్డులో ప్లాస్టిక్ వ్యర్థాల్ని వేరు చేసే పని చేస్తారు.
Good news
Great work
thank you
Good post. I learn something totally new and challenging on sites
I stumbleupon every day. It’s always exciting to read
through content from other authors and practice a little something from other websites.