సోదరుడు రాజయ్య నా విజయానికి సహకరిస్తారని నమ్మకం
3 సీట్లకు బీజేపీ పరిమితం..
కాంగ్రెస్ కప్పల తక్కెడ
ఔర్ ఎక్ ధక్కా..సీఎం కేసీఆర్ పక్కా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ 3వ సారి అధికారంలోకి రావడం ఖాయమని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ లో ఎమ్మెల్సీ,బిఅరెస్ స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కడియం శ్రీహరి గురువారం మీడియాతో మాట్లాడారు. 2014,2018 లల్లో టీఆరెస్ ఎమ్మెల్యే టికెట్ రాజయ్యకు రావడంతో నేను నా అనుచరగణంతో మద్దతుగా నిలిచి పార్టీ విజయానికి కృషిచేశామని తెలిపారు. రాబోయే 2023 ఎన్నికలలో బిఅరెస్ ఎమ్మెల్యే టికెట్ అవకాశం నాకు ఇచ్చినందున సోదరుడు ఎమ్మెల్యే రాజయ్య నా విజయానికి సహకరిస్తారని నమ్మకం ఉందన్నారు.