
కాంగ్రెస్ అగ్రనేత శ్రీ రాహుల్ గాంధీ గారు చేపట్టిన భారత్ జోడో యాత్ర జరిగి ఏడాది అయిన సందర్భంగా ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నేడు మహేశ్వరం నియోజకవర్గం, కొత్తపేటలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథి హాజరైన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కామెంట్స్
ప్రపంచమే ఆశ్చర్యం పోయే విధంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేపట్టారుభారత్ జోడో యాత్ర ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా రాహుల్ ఆలోచనలను భారత్ జోడో సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కాంగ్రెస్ పార్టీ ఈరోజు జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నది.
భారతదేశం అనేక కులాలు, మతాలు, ప్రాంతాలకు నిలయం. ఈ దేశంలో పుట్టిన ప్రతి మనిషి భారతీయుడే. మనందరం ఉమ్మడి కుటుంబంగా జాతి నిర్మాణం జరిగి దేశం అభివృద్ధి చెందాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారు.
కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అధికారం కోసం ఓట్లు పొందడానికి మతం పేరిట భారతదేశంలో చిచ్చు పెట్టి ఓట్లు పొంది అధికారం చెలాయించాలని చేస్తున్న దురాలోచన దేశ విచ్చిన్నానికి దారితీస్తున్నది.
భారతదేశం విచ్ఛిన్నం కావాలని బిజెపి చూస్తున్నది. భారతజాతి ఐక్యంగా ఉండటం బిజెపికి ఇష్టం లేదుదేశ సంపద, వనరులు ప్రజలందరికీ సమానంగా పంచబడాలి. కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం బహుళ జాతి కంపెనీలకు దేశ సంపద వనరులను ధారాదత్తం చేస్తున్నది.
దేశ భవిష్యత్తు మొత్తం కాంగ్రెస్ పార్టీదే.. రానున్న ఎన్నికల్లో కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. ఉన్నత చదువులు చదువుకొని విదేశాల్లో ఉద్యోగం చేస్తూ దేశ ఔన్నత్యాన్ని నిలబెట్టాలని రాజకీయాల్లోకి వచ్చి పార్లమెంట్లో తెలంగాణ బిల్లు కోసం పోరాడి రాష్ట్ర సాధనలో క్రియాశీలక పాత్ర పోషించిన మాజీ పార్లమెంటు సభ్యులు మధుయాష్కి గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఈ ప్రాంతంలో అనేక కార్యక్రమాలు చేపట్టాలినీ భట్టి అన్నారు.