
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ మొదటి సారి భారత్కు వస్తున్నారు. జీ 20 సమ్మిట్ కోసం ఆయన ఇండియా వస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 1.30కి ఆయన ఢిల్లీకి చేరుకుంటారు. కేంద్ర మంత్రి అశ్వని చౌబే ఆయనకు స్వాగతం పలుకుతారు. శని, ఆదివారాలు జీ20 సమావేశాలు జరుగుతాయి. ఇందుకోసం అవసరమైన అన్ని ఏర్పాట్లను కేంద్రం పూర్తి చేసింది. పటిష్టమైన భద్రత వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఏఐ సహాయంతో జనంపై కూడా నిఘా పెడుతోంది. ఢిల్లీలో రెండు రోజుల పాటు అన్ని వ్యాపార సముదాయాలను మూసి వేయాలని కేంద్రం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. సునాక్ సహా ఇతర దేశాధినేతలు కూడా ఒక్కరుగా ఢిల్లీ చేరుకోనున్నారు.