
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ కొత్త షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సిటీకు కొత్త షెడ్యూల్ నేటి నుంచి మొదలవుతుంది. ఇందులో పవన్‌పై సీన్లు షూట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ షెడ్యూల్లో యాక్షన్ సీన్స్ ఉండనున్నాయి. దీని కోసం ఆయుధాలు సిద్ధం చేసినట్లు దర్శకుడు హరీష్ శంకర్ ఈ మధ్యే తన ట్వీట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. కాగా ఈ సినిమాపై పవన్ అభిమానులు భారీ అంచనాలతో ఉన్నారు. ఆల్‌టైమ్ హిట్ అవుతుందని ఆశలు పెట్టుకున్నారు. మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది.