
రాయకీయంగా నిలదొక్కుకోవాలి
రాజకీయంగా బలపడితేనే
ఎదుగుతాం
మున్నూరు కాపులో ఎన్నో పేద కుటుంబాలు ఉన్నాయి
కలిసుంటే నిలబడతాం..
విడిపోతే పడిపోతాం
టీఎంకేజేఎఫ్ ద్వితీయ ప్లీనరీలో వక్తల పిలుపు
సికింద్రాబాద్ క్లాక్ టవర్ వద్ద గల మహబూబ్ కాలేజ్ SVIT ఆడిటోరియంలో కొత్త లక్ష్మణ్ పటేల్ ఆధ్వర్యంలో తెలంగాణ మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరమ్
ద్వితీయ ప్లీనరీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమా నికి ముఖ్యఅతిథులుగా
రాజ్యసభ సభ్యులు, బీజే పీ ఓబీసీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ కే.లక్ష్మణ్, ప్రస్తుత పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్, బీఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధు, బీఆర్ఎస్ సీనియర్ నేత, సంపాదకులు పీఎల్ శ్రీనివాస్ హాజరయ్యారు. సీనియర్ జర్నలిస్ట్, తెలంగాణ ఉద్యమకారుడు, రచయిత
గజ్జల శ్రీనివాస్ సమాజం లో జర్నలిస్టుల పాత్రను వివరిస్తూ పాట పడటంతో ప్లీనరీ ప్రారంభమైంది.
పుట్ట మధు, పెద్దపల్లి జడ్పీ చైర్మన్ :
మున్నూరుకాపులు ఆర్ధికంగా, రాజకీయంగా, సామాజికంగా బలపడాలంటే ఐక్యత ముఖ్యమని పుట్ట మధు అన్నారు. తెలంగాణలో అధిక శాతం మున్నూరు కాపులు ఉన్నారని, అయి నప్పటికి రాజకీయాల్లో సరైన ప్రాతినిద్యం లభించడం లేదని, అందుకు ఐక్యంగా లేక పోవడమే కారణమన్నారు.
రాజకీయంగా ఎదినప్పుడే
సామాజంలో నిలదొక్కుకుంటామని పుట్ట మధు అన్నారు. మున్నూరు కాపులను అణిచివేయడానికి కొన్ని కులాలకు చెందిన కొంత మంది స్వార్ధపరులు కుట్రలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నికల్లో పోటీ చేసిన మున్నూరు కాపు అభ్యర్థులను పార్టీలకు అతీతంగా సపోర్ట్ చేసి వారిని గెలిపించడానికి కృషి చేయాలని పుట్ట మధు కోరారు. మున్నూరు కాపు జర్నలిస్టులు ఒక సంఘంగా ఏర్పడటం ఎంతో సంతోషకరమైన విషయమన్నారు. నేటి సామాజంలో సంఘటితం అయితేనే గుర్తింపు వస్తుందన్నారు. జర్నలిస్టు లను ఏకతాటి పైకి తీసుకు రావడానికి చాలా కష్టతర మైన పని అని, అయినప్పటికి కొత్త లక్ష్మణ్ పటేల్ వేలాది మంది మున్నూరు కాపు జర్నలిస్టు లను ఏకం చేశారని ప్రశంసించారు.
పీఎల్ శ్రీనివాస్, బీఆర్ ఎస్ సీనియర్ నేత:
సామాజంలో జర్నలిస్టుల పాత్ర కీలక మైందని, చాలా బాధ్యతతో కూడుకున్నదని పీఎల్ అన్నారు. జర్నలిస్టులకు కులం, మతం, ప్రాంతం, వర్గం, వర్ణం లేదని, అయినప్పటికీ తన సామాజిక వర్గం కోసం న్యాయంగా పనిచేయడంలో తప్పు లేదన్నారు. మున్నూరు కాపు కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని పీఎల్ శ్రీనివాస్ కోరారు.
డాక్టర్ కే. లక్ష్మణ్, రాజ్యసభ సభ్యులు:
తెలంగాణలో మున్నూరు కాపులు అన్ని కులాల కంటే
ఎక్కువ శాతం ఉన్నారని, ఐక్యత లేకపోవడం వాళ్లే రాజకీయాల్లో రాణించలేక పోతున్నామని రాజ్యసభ సభ్యులు డాక్టర్ కే. లక్ష్మణ్ అన్నారు. సామాజంలో గుర్తింపు రావాలంటే రాజకీయాల్లో నిలదొక్కుకోవాలని, అప్పుడే గుర్తింపు వస్తుందన్నారు. తెలంగాణ లో అతి తక్కువ శాతం ఉన్న వారు అధికారం చేలాయిస్తున్నారని గుర్తు చేశారు. రాజ్యాధికారం కావాలంటే మున్నూరు కాపులందరూ ఏకం కావాలని,అందుకు జర్నలిస్టులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండు సార్లు వి.హనుమంత రావు, డి. శ్రీనివాస్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కోల్పోయారని, అందుకు మనలో ఐక్యత లేకపోవడం, ఆర్ధికంగా నిలదొక్కుకోలేకపోవడం, లాబీయింగ్ చేయకపోవడం వాళ్లే సువర్ణ అవకాశం చేజారి పోయిందని గుర్తు చేశారు. ప్రస్తుతం బీజేపీలో మున్నూరు కాపులకు సముచిత స్థానం ఉన్నదని అందుకు నిదర్శనం తనేనని చెప్పారు.
మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన తనకు గతంలో పార్టీ అధ్యక్ష పదవి, ప్రస్తుతం రాజ్యసభ సభ్యులు, ఓబీసీ జాతీయ అధ్యక్షులు సహా పార్టీ కీలక కమిటీలో
చోటు కల్పించారని చెప్పారు. బండి సంజయ్ కి జాతీయ కార్యదర్శి, డి. అర్వింద్ ను ఎంపీ చేసిందని తెలిపారు.
మున్నూరు కాపు జర్నలిస్టులు సమాజ అభివృద్ధితో పాటు తమ కులం అభివృద్ధికి కృషి చేయడంలో తప్పు లేదన్నారు.మున్నూరు కాపు జర్నలిస్టులు వివిధ పార్టీలలో ఉన్న నాయకులను ప్రోత్సహించాలని కోరారు. మున్నూరు కాపులను చైతన్య పరిచి, ఏకం కావడానికి జర్నలిస్టులు కృషి చేయాలని లక్ష్మణ్ దేశానిర్దేశం చేశారు. మున్నూరు కాపు జర్నలిస్టుల అభ్యున్నతికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మున్నూరు కాపు జర్నలిస్టులను ఏకం చేయడంలో కొత్త లక్ష్మణ్ సక్సెస్ అయ్యారని అభినం దించారు.
ఐక్యతను చాటుదాం: మున్నూరు కాపు జర్నలిస్టులంతా ఏకమై
ఐక్యతను చాటాలని పలువురు సీనియర్ జర్నలిస్టులు కోరారు. విడిపోతే పడి పోతామని, కలిసుంటే నిలబడతామని, తద్వారా సామాజంలో ఆర్ధికంగా బలపడుతామన్నారు. వ్యవసాయమే ప్రధాన వృత్తిగా జీవనం కొనసాగిస్తున్న మున్నూరు కాపులు పంటలకు గిట్టుబాటు ధరలు లేక అప్పుల పాలు అవుతున్నారని, చేసిన అప్పులు భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు పుట్ల కొద్ది పంటలు పండించి దేశానికే అన్నం పెట్టిన మున్నూరు కాపులు, నేడు ఉన్న భూములను అమ్ముకొని అన్నమో రామచంద్రా అంటూ బతుకు దెరువు కోసం పుట్టిన గడ్డను, జన్మనిచ్చిన తల్లి దండ్రులను వదిలి పుట్టెడు దుఃఖంతో వలస పోతున్నారని వివిధ జిల్లాల నుంచి వచ్చిన జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న
మున్నూరు కాపులను ఏకం చేయాల్సిన బాధ్యతను మనమే తీసుకుందామన్నారు.
కొత్త లక్ష్మణ్ పటేల్, TMKJF రాష్ట్ర అధ్యక్షులు:
తెలంగాణలో బలమైన జర్నలిస్టు సంఘంగా టీఎంకేజేఎఫ్ గుర్తింపు తెచ్చుకుందని, 33 జిల్లాల్లో 5 వేల మందికిపైగా సభ్యత్వాలు కలిగిన ఘనత టీఎంకేజేఎఫ్ కు దక్కుతుందన్నారు. మున్నూరుకాపు జర్నలిస్టులను సంఘటిత పర్చడంలో సఫలీకృతులమయ్యామన్నారు.ఓ వైపు జర్నలిస్టుల సమస్యలపై గ ళమెత్తుతూనే మరో వైపు మున్నూరుకాపు సామాజికవర్గాభివృద్ధికి వెన్నుదన్నుగా నిలిచామన్నారు.గతేడాది కరీంనగర్ జిల్లా వేదికగా ఫోరం మొదటి రాష్ట్ర ప్లీనరీ సమావేశాన్ని ఎంతో విజయవంతంగా నిర్వహించుకున్నామని, అదే స్ఫూర్తితో నిర్వహించిన ద్వితీయ ప్లీనరీ విజయవంతమైందన్నారు. ఈ సమావేశానికి తెలంగాణలోని 33 జిల్లాల నుంచి అధిక సంఖ్యలో మున్నూరు కాపు జర్నలిస్టులు తరలివచ్చారు.