
డీజీపీ ఆఫీస్ వద్ద పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..
డిజిపిని కలిసి రెండు అంశాలను చర్చించాం
హోంగార్డు రవీందర్ జీతాలు రాక ఆత్మహత్యపై డీజీపీ దృష్టికి తెచ్చాము. ఇది రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ చేసిన హత్య. కేసీఆర్ పై హత్యా నేరం కింద క్రిమినల్ కేసులు పెట్టాలి.
హోంగార్డులకు 5 నెలలుగా జీతాలు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉంది. రాష్ట్రం ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయింది. రాష్ట్రం దివాళా తీయడానికి కారణం కేసీఆర్ అవినీతి.కాంట్రాక్టర్లు, కమీషన్లు ఇచ్చే వారికే బిల్లులు ఇస్తున్నారు.
రవీందర్ పిల్లల చదువుల ఖర్చు ప్రభుత్వమే భరించాలి. కుటుంబంలోఒకరికి ఉద్యోగం, 25లక్షల పరిహారం ఇవ్వాలని డీజీపీని కోరాం.
16, 17 న తాజ్ కృష్ణ లో సీడబ్ల్యూసీ సమావేశాలు జరుగుతాయి.17న విజయ భేరి బహిరంగ సభను నిర్వహిస్తున్నాం.ఇందుకు సంబంధించి భద్రతను అందించాలని డీజీపీని కోరాం.
పరేడ్ గ్రౌండ్ ఇవ్వకుండా బీజేపీ, బీఆరేస్ కుట్ర చేశాయి.విజయభేరి బహిరంగ సభకు భద్రత కల్పించాలని కోరాం. కేసీఆర్ రాజకీయ విజ్ఞతతో వ్యవహరించాలి. ప్రభుత్వం నుంచి ఆటంకాలు కలగకుండా చూడాలి. విజయభేరీ సభకు ఆటంకం కలిగించడం సరైంది కాదు.
కేసీఆర్ చిల్లర ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారు. తుక్కుగూడాలో సభ ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించాము. కనీవినీ ఎరుగని విధంగా విజయభేరి సభను నిర్వహించి తీరతాం.