
మిస్ శెట్టీ మిస్టర్ పోలిశెట్టీ మూవీ ఇద్దరు అర్బన్ ఇండివిడ్యువల్స్ మధ్య సాగే చిత్రం. వీరిద్దరూ రెండు భిన్న ధృవాల లాంటి వాళ్లు. వీళ్ల మధ్య సాగే అర్బన్ రొమాన్స్ కొన్ని ఫన్ మూమెంట్స్ తో రొమాంటిక్ కామెడీలా ఉంటుంది. నవీన్ పోలిశెట్టి నుంచి సహజంగా ఆశించే ఎంటర్ టైన్ మెంట్ ఇందులో బాగానే కనిపించింది.

అనుష్కా శెట్టికి ఇది ఒక మంచి కమ్ బ్యాక్ గా చెప్పొచ్చు. నవీన్ మంచి పెర్ఫామెన్స్, మంచి టైమింగ్స్ తో సాగుతుంది. అతని సంభాషణలు, పెర్ఫార్మెన్స్, స్క్రీన్ ప్రెసెన్స్ అభిమానులనే కాదు సినిమా ప్రేమికులను కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి.

రిలేషన్షిప్, పెళ్లి, పేరెంట్ హుడ్ విషయంలో పూర్తిగా భిన్న అభిప్రాయాలున్న ఇద్దరి మధ్య సాగే రొమాంటిక్ డ్రామా ఈ సినిమా. ఆద్యంతం కామెడీ పండిస్తూ సాగే కథనంలో హాస్యం కొంతమేర ఆకట్టుకునేలా ఉంది. ఇందులో అనుష్కా నటన విమర్శకుల ప్రశంసలు సైతం పొందేలా ఉంది. మురళీశర్మ, తులసి తమ పాత్రల్లో అత్యంత సహజంగా జీవించారు.

చిత్రం కథ విషయానికి వస్తే అన్వితా శెట్టి (అనుష్కా శెట్టి) మాస్టర్ షెఫ్. అనుకోని పరిస్థితుల్లో లండన్ లో ఉంటున్న ఆమె హైదరాబాద్ తిరిగివస్తుంది. ఇందులో రెండు భిన్నధృవాల వంటి ఇధ్దరు వ్యక్తులతో మొత్తం సినిమాను దర్శకుడు మహేష్ బాబు నడిపించారు. ఇందులో అన్వితకు పెళ్లి అన్నా, రొమాన్స్ అన్నా సిగ్గుపడే స్వభావం. అయితే తన జీవితంలో ఏర్పడిన శూన్యాన్ని పోగొట్టుకోవడానికి అన్విత తల్లి కావాలనుకుంటుంది. అందుకోసం స్పెర్మ్ డోనర్ కోసం వెతుకుతుంటుంది.

ఇందులో నవీన్ పోలిశెట్టి పోషించిన సిద్దూ పాత్ర మన చుట్టూ ఉన్న ఎందరో సాధారణ వ్యక్తుల్లాంటిదే. ఇందులో సిద్ధూ పాత్ర పోషించిన నవీన్ ఇంజనీరింగ్ చేసి ఐటి జాబ్ చేస్తుంటాడు. స్టాండప్-కామిక్. ఆ ఆర్ట్ లో ఆనందాన్ని ఆస్వాదించే క్యారెక్టర్. ఒక స్టాండప్ కామిక్ కు, షెఫ్ కు మధ్య సాగే ఈ రొమాంటిక్ కామెడీ ఫన్నీగా సాగుతుంది. సినిమా ప్రధానంగా ఇద్దరు వ్యక్తుల భిన్న అభిప్రాయాల భూమికగా సాగుతుంది. అందులో సబ్ ప్లాట్ గా స్టాండప్ కామెడీని డైరక్టర్ తీసుకువచ్చారు.

ఈ పాత్రల మధ్య ఉండే ఏజ్ గ్యాప్ విషయాన్ని తెరకెక్కించిన విధానం పూర్తిగా కన్విన్సింగ్ లేదనిపించిన సందర్భాలు ఉన్నాయి. మొత్తానికి ఈ సినిమాలో అందరూ ఆశించినట్టు నవీన్ పోలిశెట్టి పూర్తిస్థాయి వినోదాన్ని పంచారు. నవీన్ పోలిశెట్టి స్టాండప్ పర్ఫెమెన్స్ స్ చాలా బాగున్నాయి. స్టాండప్ కమేడియన్ లో కనిపించే పంచ్ మెరుపులు సిద్దూ పాత్రలో నవీన్ బాగా పండించాడు. అనుష్క పాత్రోచితంగా నటనను పండించింది.
తారాగణం: నవీన్ పోలిశెట్టి, అనుష్కా శెట్టి, మురళీ శర్మ, తులసి యువి క్రియేషన్స్ సినిమా
డైరెక్టర్: పి.మహేష్ బాబు
సంగీతం: రథన్