
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గారు చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర పుస్తకాన్ని శనివారం హైదరాబాద్ గాంధీభవన్‌లో ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్చార్జి మాణిక్‌రావు ఠాక్రే గారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, దుద్దిల్ల శ్రీధర్ బాబు, చిన్నారెడ్డి, మాజీ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య మాజీ కేంద్రమంత్రి బలరాం నాయక్, మాజీ పార్లమెంటు సభ్యులు సిరిసిల్ల రాజయ్య, ఖైరతాబాద్, రంగారెడ్డి డిసిసి అధ్యక్షులు చల్ల నరసింహారెడ్డి, రోహిన్ రెడ్డి తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు*ఎఐసిసి జనరల్ సెక్రెటరీ మాణిక్‌రావు ఠాక్రే కామెంట్స్*సిఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర... మహాయాత్రమండు టెండలను సైతం లెక్కచేయకుండా 110 రోజులపాటు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేశారు.భట్టి విక్రమార్క గారు చేపట్టిన సాహసోపేతమైన పాదయాత్ర తెలంగాణలో ఇంతకుముందు ఏ రాజకీయ పార్టీ నాయకులు చేయలేదుభట్టి విక్రమార్క వేసిన ప్రతి అడుగు కాంగ్రెస్ పార్టీ విజయానికి దోహద పడనుందిఎస్సీ ఎస్టీ ఓబీసీ పేదలతో పాటు అన్ని వర్గాల ప్రజల కష్టాలను తెలుసుకోవడానికి ప్రజాక్షేత్రంలోకి వెళ్లిన భట్టి విక్రమార్క వారి సమస్యలు చూసి, విని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వాటిని ఎలా పరిష్కరిస్తుందో ప్రజలకు వివరించి ఒక భరోసా కల్పించారు.టబిఆర్ఎస్ బిజెపి ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టారు.*సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కామెంట్స్*ఎఐసిసి ఆదేశాల మేరకు సీఎల్పీ లీడర్ గా కాంగ్రెస్ పార్టీ బలోపేతం, తెలంగాణలో ప్రజా ప్రభుత్వం తీసుకురావాలనిఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేశానుపాదయాత్ర నేను చేసినప్పటికీ అంతా తానై నన్ను నడిపించింది ఏఐసిసి ఇన్చార్జ్ మానిక్‌రావు ఠాక్రే, ఎఐసిసి సెక్రెటరీ రోహిత్ చౌదరి తదితర నాయకులుఆదిలాబాద్ జిల్లా పిప్పిరి నుంచి ఖమ్మం వరకు జరిగిన పాదయాత్ర ఏర్పాట్లు, రూట్ మ్యాప్, నాయకులను సమన్వయం చేస్తూ పాదయాత్ర విజయవంతం కోసం మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు గారు కృషి చేశారు.నా పాదయాత్ర విజయవంతం కోసం ఎఐసిసి సెక్రెటరీ శ్రీధర్ బాబు గారు వివిధ జిల్లాలో ఉన్న కాంగ్రెస్ నాయకులతో తన ఆలోచనలను పంచుకొంటూ సమన్వయం చేస్తూ వచ్చారుమాజీ పిసిసి అధ్యక్షులు వి హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్ కుమార్ రెడ్డి లు తమ పరిచయాలను, సుదీర్ఘ రాజకీయ అనుభవంతో పాదయాత్ర విజయవంతం కోసం నాయకులను సమన్వయం చేస్తూ మాట్లాడుతూ ముందుకు నడిపించారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యం చేసి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది ఎందుకు? ఏమిటి? ఇప్పుడు ఏం జరుగుతుందో? అనేక అంశాలు మాట్లాడించారు.పాదయాత్ర జరుగుతుందా అన్న అనుమానాల్లో అసాధ్యాన్ని సుసాధ్యం చేసి అంబేద్కర్ జయంతి రోజున మంచిర్యాలలో లక్షల మందితో బహిరంగ సభ నిర్వహించి పాదయాత్రకు మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు గారు జవసత్వాలు నింపారు.మండు టెండలో అడుగులు పడుతున్నంత సేపు భయాందోళన ఉండేది.కానీ, ఇప్పుడు కాకుంటే మరి ఎప్పుడు అని ప్రాణాలకు తెగించైనా కాంగ్రెస్ ను ముందుకు నడిపించాలని అన్నింటికీ తెగించి నడిచిందే పీపుల్స్ మార్చ్ పాదయాత్రనా పాదయాత్రకు పీపుల్స్ మార్చ్ అని నామకరణం చేసింది ప్రజాయుద్ధ నౌక గద్దర్పీపుల్స్ మార్చ్ లాంగ్ మార్చ్ గా మారాలని గద్దర్ ఆ పేరును పెట్టారు.ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వం పైన, గడీల పాలన పైన తిరగబడి ప్రజలు నడుస్తున్న యాత్రగా సాగిందే పీపుల్స్ మార్చ్.పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో ప్రజా యుద్ధనౌక గద్దర్ అన్న తన ఆటలు ఆడుతూ… పాటలు పాడుతూ.. మాటలు చెబుతూ ఎక్కడ నిరుత్సాహాం రాకుండా నన్ను ప్రోత్సహించి నడిపించారు.గద్దర్ అన్నకు ఈ సందర్భంగా ఘనమైన నివాళులు అర్పిస్తున్నానుభూమికి సంబంధించిన అనేక అంశాలను నక్సలైట్ల చర్చల సందర్భంగా కోనేరు రంగారావు కమిటీ సిఫారసు చేసిన అంశాలను తూచా తప్పకుండా అమలు చేస్తామని చాలా గ్రామాల్లో నాతో చెప్పించారు.చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ వెనుక గద్దర్ అన్న ఆలోచన దాగి ఉందిగద్దర్ అన్న బతికి ఉంటే ఆ సభలో ఎగిరి దూకి గంతులు వేస్తూ ఆనంద పడేవారుకాంగ్రెస్ పార్టీ ద్వారా గద్దర్ అన్న ఆశయాలు, లక్ష్యాలను సాధిస్తాం2023 -24 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ మెజార్టీతో విజయం సాధించడం ఖాయంకాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్న తపన తో పని చేస్తున్న ప్రతి ఒక్కరిని గుర్తిస్తాం, గౌరవిస్తాం.*ఏఐసిసి కార్యదర్శి మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు కామెంట్స్*కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి ఆనాడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రజాప్రస్థానం పేరుతో చేపట్టిన పాదయాత్ర, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర స్ఫూర్తితో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలంగాణలో ప్రజా ప్రభుత్వం తీసుకురావడానికి ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పీపుల్స్ మార్చి పేరిట పాదయాత్ర చేశారు.పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో అడుగడుగునా బిఆర్ఎస్, బిజెపి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టే క్రమంలో ప్రభుత్వాలు ఎంత నిర్బంధం పెట్టిన, మండుటెండలో నడవడం ఎంత కష్టమైనా, ఆరోగ్యం దెబ్బతిన్న తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు కోసం ప్రజల్లో భరోసా కల్పించడానికి పదోవం 1300 కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేశారుభట్టి విక్రమార్క పాదయాత్ర కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తీసుకురావడానికి దోహదపడుతుందిగత తొమ్మిది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడుతున్న కాంగ్రెస్ నాయకులకు పార్టీ అధికారంలోకి రాగానే మంచి అవకాశాలు కల్పిస్తామని ఏఐసిసి ఇన్చార్జి మాణిక్యం డాక్టర్ గారి సమక్షంలో చెబుతున్నాం*పిసిసి మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య కామెంట్స్*సీఎల్పీ నేత భట్టి పట్టుదలని విక్రమార్కుడు.ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు భట్టి విక్రమార్క పాదయాత్ర రాహుల్ గాంధీ భారత్ జూడో స్ఫూర్తితోనే కొనసాగింది.భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజున మంచిర్యాలలో పాదయాత్ర బహిరంగ సభకు ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారు వచ్చి ఆశీర్వదించి ప్రోత్సహించారు.డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గారు జాతి కోసం పని చేసే మంచి నాయకులని చెప్పాల్సిన అవసరం లేదు.కాలోజీ నారాయణరావు జయంతి రోజున సిఎల్పీ నేత భట్టి బట్టి విక్రమార్క గారి పాదయాత్ర పుస్తకావిష్కరణ జరగడం చారిత్రాత్మకం కానుంది.