
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అరెస్టు అయిన మాజీ సీఎం చంద్రబాబు పెళ్లి రోజు ఈ రోజు. 1981 సెప్టెంబర్ 10న చంద్రబాబు ప్రముఖ నటుడు, మాజీ సీఎం దివంగత ఎన్టీయార్ కుమార్తె భువనేశ్వరిని పెళ్లి చేసుకున్నారు. వారికి పెళ్లయి 42 ఏళ్లవుతోంది. అయితే ఈ పెళ్లి రోజున మాత్రం ఆయన మరుపులేని అనుభవాన్ని ఎదుర్కొంటున్నారని చెప్పవచ్చు. నిన్న రాత్రి ఏపీ సీఐడి పోలీసులు నంద్యాలలో అరెస్టు చేసి నేడు ఆయనను కోర్టు ముందు హాజరు పరిచారు. వాదనలు పూర్తయ్యే వరకు కోర్టు నుంచి కదలనని చంద్రబాబు పట్టుదలకు పోవడంతో రోజంతా అక్కడే ఉండాల్సిన పరిస్థితి. దాంతో ఉదయమే అమ్మవారిని దర్శించికోవాల్సిన వారి ప్రోగ్రామ్ రద్దయ్యింది. తాము ఇవ్వాళ అమ్మవారి ఆశిర్వాదాల కోసం గుడికి వెళ్దామని అనుకున్నామని ఆయన సతీమణి భువనేశ్వరి నిన్న మీడియాతో చెప్పారు.