
ప్రముఖుల నుంచి అంతగా రాని దరఖాస్తులు
సిట్టింగ్ ఎంపీల నుంచి రాని దరఖాస్తులు
సీనియర్ నేతలు కూడా ఎవరూ దరఖాస్తు చేసుకోలేదు
ఈ వారం రోజుల్లో దరఖాస్తు చేసుకున్న ప్రముఖుల్లో..ఈటెల రాజేందర్, రఘునందన్ రావు, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి మినహా ఇతర ప్రముఖులు ఎవరు దరఖాస్తు చేసుకోలేదు
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నుంచి మొదలుకుంటే రాష్ట్ర ముఖ్య నేతలు, జాతీయ నేతలు ఎవరు కూడా దరఖాస్తు చేసుకోలేదు.
ఒకరకంగా చెప్పాలంటే… ఈ దరఖాస్తులు కేవలం సెకండ్ క్యాడర్ నేతలకు మాత్రమే…సీనియర్లకు వర్తించదు..అనేలా మారింది
ఇవ్వాళ దరఖాస్తు చేసుకున్న వారిలో ప్రముఖులు… బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రారెడ్డి.. ఖైరతాబాద్ నుంచి, ఈటెల రాజేందర్ భార్య జమున…హుజురాబాద్ నుంచి, సినీ నటి జీవిత ఏకంగా ఐదు చోట్ల నుంచి దరఖాస్తు చేసుకున్నారు. సనత్ నగర్, కూకట్ పల్లి, శేర్ లింగంపల్లి, జూబ్లీ హిల్స్, సికింద్రాబాద్ నియోజక వర్గాల నుంచి జీవిత దరఖాస్తు చేసుకున్నారు
సీనియర్లు ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవాల్సిందే..అని రాష్ట్ర బీజేపీ ఎన్నికల ఇంచార్జీ ప్రకాశ్ జవదేకర్ స్పష్టంగా చెప్పినా…వారి నుంచి అంతగా స్పందన మాత్రం కనిపించలేదు
సీనియర్లు అందరూ కూడా పార్లమెంట్ కే పోటీ చేసేందుకు మొగ్గు చూపడంతో ఎమ్మెల్యేగా పోటీ కోసం వారు దరఖాస్తు చేసుకోలేదని పార్టీలో చర్చ సాగుతోంది