
జూమ్ మీటింగ్ లో డీసీసీ అధ్యక్షులతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి..
ఈ నెల 11 నుంచి అన్ని మండలాల్లో సమావేశాలు ఏర్పాటు చేయాలి.. ఈ నెల 17న సాయంత్రం 5గంటలకు విజయభేరీ సభ ఉంటుంది.119 శాసనసభ నియోజకవర్గాల్లోని అన్ని మండలాల్లో సమావేశాలు నిర్వహించుకోవాలి
రాష్ట్రంలోని 35వేల బూత్ ల నుంచి సభకు తరలివచ్చేలా చూడాలి.రేపు 17 పార్లమెంట్ అబ్జర్వర్లు, వైస్ ప్రెసిడెంట్స్ తో సమావేశం నిర్వహిస్తాం.
వారు ఈ నెల 12,13,14 మూడు రోజులు పార్లమెంటు పరిధిలో అన్ని నియోజకవర్గాల్లో సమీక్షలు చేస్తారు. జిల్లా పార్టీ అధ్యక్షులు వారితో సమన్వయం చేసుకోవాలి.17న రాజీవ్ గాంధీ ప్రాంగణంలో విజయభేరీ సభలో సోనియాగాంధీ 5 గ్యారంటీలను విడుదల చేస్తారు.
18న ఉదయం 11 గంటలకు 119 నియోజకవర్గాలకు జాతీయ నాయకులు చేరుకుంటారు.18న వారితో కలిసి 5గ్యారంటీలకు సంబంధించి పోస్టర్లు అతికించాలి. ఇంటింటికి గ్యారంటీ కార్డులను అందజేయాలి.కార్యకర్తలతో భోజనాలు చేయాలి.
ఆ తరువాత ప్రెస్ మీట్స్ పెట్టి 5 గ్యారంటీలను వివరించాలి.18న ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించాలి.ప్రతీ ఒక్కరు సమన్వయం చేసుకుని సభను విజయవంతం చేసేందుకు కృషి చేయాలి.