టీచర్ ట్రైనింగ్ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు తీపి కబురు వెలువడింది. టెట్ పరీక్షను సెప్టెంబర్ 15వ తేదీన నిర్వహించనున్నట్లు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆగస్టు 2 నుంచి 16వ తేదీ వరకు అప్లికేషన్లు స్వీకరిస్తారు. సెప్టెంబర్ 27న ఫలితాలు వెలువడుతాయి. పరీక్ష ఉదయం పేపర్ 1 (ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 వరకు) , మధ్యాహ్నం పేపర్ 2 (మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 వరకు) పరీక్ష నిర్వహిస్తారని విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.