
హైదరాబాద్‌లోని పంజాగుట్టలో ఒక హోటల్లో దారుణం జరిగింది. అక్కడ మెరీడియన్ హోటల్లో బిర్యానీ తింటున్న ఒక యువకుడు ఎక్స్ట్రా పెరుగు అడిగినందుకు గొడవ జరిగింది. పెరుగు తేవడం ఆలస్యం కావడంతో జరిగిన రచ్చ ఓల్డ్ సిటీకి చెందిన ఒక యువకుడు ప్రాణాలు కోల్పోవడానికి కారణం అయ్యింది. చాంద్రాయణగుట్టకు చెందిన లియాకత్ బిర్యానీ కోసం మెరీడియన్‌కు వచ్చాడు. ఎక్స్ట్రా పెరుగు అడిగిన క్రమంలో గొడవ జరిగింది. ఈ గొడవలో ఓనర్ ప్రోద్బలంతో అక్కడ ఉన్న వెయిటర్లు లియాకత్‌ను విక్షణారహితంగా కొట్టారు. ఇది కూడా పంజాగుట్ట పోలీసుల సమక్షంలో జరిగింది. లియాకత్ తనకు ఊపిరి ఆడడం లేదని చెప్పినా వినలేదు. పోలీసులు దాన్ని లైట్ తీసుకున్నారు. అదే అదనుగా హోటల్ సిబ్బంది చితకబాదారు. దాంతో లియాకత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా లియాకత్‌ను పోలీసుల సమక్షంలో కొడుతున్న వీడియో వైరల్ అయ్యింది. దాంతో సిటీ సీపీ సీవీ అనంద్ పంజాగుట్ట పీఎస్‌కు చెందిన ఏసై శివశంకర్‌తో పాటు హెడ్ కానిస్టేబుల్ రమేష్‌ను సస్పెండ్ చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.