
జైలర్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న రజనీకాంత్ అభిమానులకు మరో శుభవార్త కూడా బయటకు వచ్చింది. ఆయన తాజా చిత్రం గురించి అధికారికమైన ప్రకటన ఒకటి వెలువడింది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ 171 సినిమా అయిన ‘విక్రమ్’ ఫేమ్ దర్శకుడు కనకరాజ్ తో ఈ కొత్త సినిమా తెరకెక్కుతోంది. అది తలైవార్ 171 అనే వర్కింగ్ టైటిల్ తో వెండితెరకెక్కనున్నట్టు ఆ సినిమా వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ రూపొందిస్తోంది. దీనికి సంగీతాన్ని అనిరుధ్ రవిచంద్రన్ రూపకల్పన చేస్తున్నారు. ఈ విషయాన్ని సన్ పిక్చర్స్ అధికారికంగా ట్విట్టర్ లో వెల్లడించింది.