
ఈ మధ్య పట్టుపడ్డ టాలివుడ్ డ్రగ్ కేసులో యువతులు డ్రగ్స్ తీసుకుంటున్న విధానం బేబీ మూవీలోని సీన్లను పోలి ఉన్నాయని హైదరాబాద్ సీపీ సి.వి.ఆనంద్ సీరియస్ అయ్యారు. సినిమా డ్రగ్స్‌ను ప్రోత్సహించే తీరులో ఉందన్నారు. మూవీ డైరెక్టర్, నిర్మాతలకు సీపీ నోటీసులు ఇచ్చారు. సినిమాల్లో డ్రగ్స్‌కు సంబంధించిన దృశ్యాలు ఉన్నపుడు హెచ్చరికలు పెట్టాలనీ, కానీ మూవీ మేకర్లు ఆ పని చేయలేదన్నారు. ఇకపై అన్ని సినిమాలపై నిఘా వేస్తామన్నారు. కాగా, సినిమా డైరెక్టర్, ప్రొడ్యూసర్లు సీవీ ఆనంద్‌ను కలిసి సీన్లపై వివరణ ఇచ్చారు.