
ఢిల్లీ మద్యం కేసులో తాను అప్రూవర్ గా మారారన్న వార్తల్లో నిజం లేదని అరుణ్ రామచంద్ర పిళ్లై తన న్యాయవాదుల ద్వారా స్పష్టంచేశారు. తప్పుడు, నిరాధారమైన వార్తలను ప్రచురించడమపై ఈ సందర్భంగా పిళ్లై తరపు న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తంచేశారు. సిఆర్పీసి సెక్షన్ 164 కింద దీనిపై అరుణ్ పిళ్లై ఎలాంటి వాగ్మూలం ఇవ్వలేదని కూడా ఆయన తరపు న్యాయవాదులు స్పష్టం చేశారు. దాంతోపాటు ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పిళ్లై న్యాయవాదులు హెచ్చరించారు.