
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్లో చేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమయంలో ఆయన కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. సోనియా సమక్షంలో ఆయన పార్టీ చేరుదామని తొలుత భావించారు. కానీ సీడబ్ల్యుసీ మీటింగ్ షెడ్యూల్ ఇందుకు పర్మిట్ చేయకపోవడంతో ఆయన ఖర్గే సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఏఐసీసీ ఆర్గనైజేషన్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, కర్నాటక సీఎం సిద్ధరామయ్య, తెలంగాణ ఇంఛార్జి మాణిక్ రావు ఠాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఇటీవల కాంగ్రెస్లో చేరిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో ఉన్నారు. పాలేరులో పోటీకి అంగీకరిస్తేనే పార్టీలో చేరుతానని తుమ్మల పట్టుబట్టారనీ, అదే స్థానం నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా పోటీ చేయాలని భావిస్తున్నందన స్థబ్ధత నెలకొందని టాక్ నడిచింది. అయితే పోటీ విషయంలో స్పష్టత లేకుండానే తుమ్మల చేరిక తంతు పూర్తయ్యింది.