
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పోచంపల్లి ఇక్కత్ చీరలో దర్శనమిచ్చారు. హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణా హోటల్లో జరుగుతున్న సీడబ్ల్యుసీ మీటింగ్‌లో ఆమె స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. సాధారణంగా కాటన్ చీరలను ఇష్టపడే సోనియా గాంధీ తెలంగాణ సంస్కృతిలో భాగమైన ఇక్కత్ శారీ ధరించడం విశేషం. ఎరుపు రంగు చీరపై తెల్లని బార్డర్‌తో ఉన్న చీరలో ఆమె కనిపించారు. పోచంపల్లి, భువనగిరి ప్రాంతాల్లో ఇలాంటి చీరలు నేస్తారు. ప్రియాంక గాంధీ చుడీదార్లో వచ్చారు. బ్లాక్ చుడీదార్పై వైట్ డాట్స్ ఉన్నాయి.