
కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో బ్యాడ్మింటర్ స్టార్ పీవీ సింధు భేటీ అయ్యారు. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచనా దినోత్సవం కోసం ఆయన హైదరాబాద్ వచ్చారు. 16వ తేదీ సాయంత్రమే హైదరాబాద్ చేరుకున్న అమిత్ షాను సింధు కలిశారు. జూబ్లీహిల్స్‌లోని సీఆర్పీఎఫ్ క్వార్టర్స్‌లో బస చేసిన షా కేవలం సింధుకు మాత్రమే అపాయింట్మెంట్ ఇచ్చారు. సొంత పార్టీ నేతలను కూడా కలవలేదు. హైదరాబాద్‌కు పర్యటనకు వచ్చిన ప్రతీసారి ఆయన ప్రముఖులను కలవడం ఒక ఆనవాయితీగా పెట్టుకున్న విషయం తెలిసింది. గతంలో సినీ యాక్టర్లు జూనియర్ ఎన్టీయార్, నితిన్‌ను కలిశారు.